Latest News

Powered by Blogger.
Sunday, 1 May 2016

మెడ నొప్పి తగ్గటానికి...చిన్న చిన్న వ్యాయామాలు

ఈ రోజుల్లో ప్రతి ఒక్కరు computer ముందు కూర్చుని ఎక్కువ Time పనిచేయటం వల్ల తరచుగా Neck  నొప్పి సమస్యతో బాధ పడుతున్నారు. Neck Pain  తగ్గటానికి మందుల కన్నా వ్యాయామాలు బాగా పనిచేస్తాయి. మెడ వ్యాయామాలు చేయటం వల్ల మెడ నొప్పి తగ్గటమే కాకుండా ఒత్తిడి నుండి ఉపశమనం కలుగుతుంది. ఇప్పుడు ఆ exercises ఎలా చేయాలో తెలుసుకుందాం. 

* మెడ వ్యాయామాలను నిల్చుని,కూర్చొని చేయవచ్చు. ప్రతి స్టెప్ మూడు సార్లు చేయాలి.

* ముందుగా శరీరాన్ని విశ్రాంతిగా ఉంచి, చేతులను కిందకు జార విడిచినట్టు వదిలేయాలి. మెడను నిదానంగా ఎడమ భుజం వైపు తిప్పి ఐదు సెకన్ల పాటు అలా ఉండాలి. ఆ తర్వాత యధా స్థితికి రావాలి. ఆ తర్వాత కుడి భుజం వైపు తిప్పి ఐదు సెకన్ల పాటు అలా ఉండి, ఆ తర్వాత మాములు స్థితికి రావాలి. 

* తలను నిదానంగా ఎడమ భుజం మీదకు వంచి, ఐదు సెకన్ల తర్వాత తలను పైకి లేపి నిటారుగా ఉంచి ఆ తర్వాత కుడి భుజం మీదకు వంచి ఐదు సెకన్ల తర్వాత మాములు స్థితికి రావాలి.

* తలను నిదానంగా ముందుకు వంచాలి. ఈ దశలో గడ్డం గొంతుకు తగులుతుంది. ఆ తర్వాత తలను నిటారుగా లేపి తలను అదే విధంగా వెనక్కి వాల్చాలి. ప్రతి దశలోను ఐదు సెకన్ల పాటు ఉండాలి. 

ప్రతి రోజు క్రమం తప్పకుండా ఈ వ్యాయామాలను చేస్తూ ఉంటే మెడ నొప్పి తగ్గటమే కాకుండా మెడ నరాలకు ఒత్తిడి నుండి ఉపశమనం కలుగుతుంది. ఈ వ్యాయామాలను చేయటానికి ఎటువంటి నిబందనలు పాటించ వలసిన అవసరం లేదు. ఎప్పుడైనా, ఏ సమయంలోనైనా చేయవచ్చు.

  • Blogger Comments
  • Facebook Comments
Top