Latest News

Powered by Blogger.
Saturday, 7 May 2016

దేవుడు ఉంగారాన్ని ఎలా ధరిస్తే మంచిది

సాదారణంగా చాలా మంది దేవుని ఉంగరాలను ధరిస్తారు. అలాగే గొలుసులో కూడా దేవుని లాకెట్ లను వేసుకుంటారు. ఉదయం నిద్ర లేవగానే దేవుణ్ణి కళ్ళకు అద్దుకోవటం వంటివి చేస్తూ ఉంటారు. అసలు దేవుని ఉంగరాలను ఎలా ధరించాలి. వాటిని ధరించటానికి నియమాలు ఉన్నాయా? ఆ నియమాలను పాటిస్తే మంచి జరుగుతుందా? ఆ నియమాలు తెలుసుకోవాలని అనుకుంటే ఈ వ్యాసాన్ని చదవండి. 

ప్రతి రోజు ఉదయాన్నే దేవుని ఉంగరాన్ని కళ్ళకు అద్దుకోవటం, దండం పెట్టుకోవటం వంటివి చేస్తూ ఉంటాం. ఆ ప్రతిమలో దైవత్వం ఉందని భావిస్తాం. అయితే ఉంగరాన్ని పెట్టుకోవలసిన విధంగా పెట్టుకోకపోతే మంచిది కాదని కొంత మంది పండితులు అంటున్నారు. 

ఉంగరాలు పెట్టుకొనే ముందు జాతక రిత్యా చూసుకోవటం మరియు దేవాలయాల్లో పూజలు చేయించుకోవటం వంటివి చేసిన తర్వాత మాత్రమే ధరించాలి. ఈ విధంగా చేయుట వలన ఆ దేవుని ప్రతిమలకు శక్తి వస్తుంది. ఈ విధంగా ధరించటం వలన దేవుడు మన వెంట ఉన్నాడని నమ్మకం కలుగుతుంది. అంతేకాక ఉంగరం ధరించాక కూడా కొన్ని జాగ్రత్తలను తప్పనిసరిగా తీసుకోవాలి. 

ఉంగరంలో ఉన్న దేవుని ప్రతిమ శిరస్సు మణికట్టు వైపు,కాళ్ళు గోళ్ళ వైపు ఉండాలి. ఎందుకంటే మన శరీరం చేతి వేళ్ళు, గోర్లు భూమిని చూస్తూ ఉంటాయి. ఉంగరాన్ని కళ్ళకు అద్దుకొనెటప్పుడు గుప్పిట ముడిచి కళ్ళకు అద్దుకోవాలి. 

స్త్రీలు అయితే బహిస్టు సమయానికి ముందుగానే దేవుని ఉంగరాలు, లాకెట్స్ తీసివేయాలి. ఆ సమయంలో ధరించటం మంచిది కాదు. 

అలాగే భోజనం చేసే సమయంలో కూడా తీసేయాలి. ఎందుకంటే మన ఎంగిలి దేవుని ప్రతిమకు అంటకూడదు. అంతేకాకుండా మాంసాహారం తినే సమయంలో కూడా ఉంగరాలను తిసేయటం మంచిది. 

మగవారు పొగ త్రాగే సమయంలో ఆ పొగ మనం ధరించిన దేవుని ప్రతిమకు తగులుతుంది. ఆ విధంగా తగలటం మంచిది కాదు. అంతేకాక మద్యపానం కూడా అంతే.

 ఈ జాగ్రత్తలను పాటిస్తేనే దేవుని ఉంగరాలను పెట్టుకోవాలి. లేకపోతే మనకు మంచి కన్నా చెడే ఎక్కువగా జరుగుతుంది. 

  • Blogger Comments
  • Facebook Comments
Top