Latest News

Powered by Blogger.
Monday, 23 May 2016

పెద్దవారి పాదాలకు నమస్కారం ఎందుకు చేయాలి?

మన హిందూ సంప్రదాయంలో పెద్దవారి కాళ్ళకు దండం పెట్టటం అనేది ముఖ్యమైన సంప్రదాయం. అముమ్మ,నాయనమ్మ,తాతయ్య,పెద్దమ్మ,పెద్దనాన వంటి పెద్దవారికి వంగి కాళ్ళకు నమస్కారం చేస్తూ ఉంటాం. అయితే ఈ రోజుల్లో ఇలాంటి సన్నివేశాలు అరుదుగా కనిపిస్తున్నాయి. ఈ సంప్రదాయం వేదాల కాలం నుండి మనకు ఉంది. అసలు ఈ సంప్రదాయాన్ని ఎందుకు పాటించాలి? ఈ విధంగా చేయటం వలన ఏమి జరుగుతుంది.

పాటించాలి ఈ ఆధునిక ప్రపంచంలో మనుషులు డైరెక్ట్ గా మాట్లాడుకోకుండా ఫోన్స్,వాట్సాప్ అంటూ టెక్నాలిజి మీద ఆధారపడుతున్నారు. దాంతో ఒకరి మధ్య ఒకరికి అనుబందం తగ్గిపోతుంది. పెద్దవారికి నమస్కారం చేయటం అనేది చాలా అరుదుగా మాత్రమే కనపడుతుంది. కేవలం పుట్టినరోజు,పెళ్ళిళ్ళలో మాత్రమే పెద్దవారికి నమస్కారం చేయటం జరుగుతుంది. 

కేవలం పెద్దవాళ్ళకు నమస్కారం చేయటం అనేది పూర్వ కాలం నుండి వస్తుంది. దీని గురించి మహాభారతంలో వివరంగా చెప్పారు. అందుకే పెద్దవాళ్ళ కాళ్ళకు నమస్కారం చేయటం అనాదిగా వస్తుంది. 

నమస్కారం ఈ సంప్రదాయాన్ని మొదట మహాభారతంలో ధర్మరాజు ప్రారంభించాడు. ఈ విధంగా నమస్కారం చేయుట వలన శక్తి,గొప్ప అనుభూతి కలుగుతుంది. అలాగే వారి దీవెనలు కొండత బలాన్ని ఇస్తాయి. 

పెద్దవాళ్ళకి నమస్కారం చేయుట వల్ల వారి మీద గౌరవ మర్యాదలు పెరుగుతాయి. ఇది పెద్దవారి పట్ల గౌరవం ఉందని చెప్పటానికి ఒక సంకేతంగా ఉంటుంది. అలాగే సమాజం పట్ల గౌరవ భావం కూడా పెరుగుతుంది. 

మనిషి శరీరంలో పాజిటివ్ ఎనర్జీ మరియు నెగిటివ్ ఎనర్జీ అనేవి ఉంటాయి. ఎప్పుడైతే మనం పెద్దవాళ్ళ కాళ్ళకు నమస్కారం చేస్తామో వారి నుంచి పాజిటివ్ ఎనర్జీ మనకు చేరుతుంది. దాంతో మనకు సానుకూల దృక్పదం ఏర్పడుతుంది. 

మనకు  వంగి నమస్కరం చేయటం వల్ల ఆరోగ్య ప్రయోజనాలు కూడా ఉన్నాయి. వంగటం వలన వెన్నుముకకు మంచి వ్యాయామంగా ఉంటుంది. ఏది ఏమైనా మన పెద్దవారు పెట్టిన సంప్రదాయాలలో ఆరోగ్య ప్రయోజనాలు దాగి ఉన్నాయి.

  • Blogger Comments
  • Facebook Comments
Top