పవన్ కళ్యాణ్ 2019 ఎన్నికల్లో జనసేన పార్టీని పూర్తి స్థాయి పార్టీగా ప్రజల ముందుకి తీసుకువెళ్ళే ఆలోచనలో ఉన్నాడు. వేరే పార్టీతో పొత్తు పెట్టుకున్న పెట్టుకోకపోయినా, ఈ సారి ఎన్నికల బరిలోకి పవన్ దిగటం మాత్రం ఖాయం. ఎన్నికలు అంటే ఆషామాషీ వ్యవహారం కాదు. దానికి చాలా ప్రచారం కావాలి. తనని ఎప్పుడు వార్తల్లో ఉంచటానికి న్యూస్ పేపర్ లేదా చానల్స్ అవసరం. పవన్ కళ్యాణ్ దాని కోసం ఇప్పటి నుంచే కసరత్తులను ప్రారంభించేసాడు.
తన తరుపున మాట్లాడే మీడియా సంస్థ ఉంటే ఎన్నికల సమయంలో బాగుంటుందని భావిస్తున్నాడు. అయితే చానల్ ప్రారంభించాలంటే చాలా ఖర్చు అవుతుంది. ఒక పత్రిక స్థాపించాలన్న ఇప్పట్లో తెమిలే వ్యవహారం కాదు. అందుకే పవన్ నష్టాల్లో ఉన్న ఒక చానల్ కొనుగోలు చేసి దానికి మరమత్తులు చేయాలనీ భావిస్తున్నాడు. చానల్ కి కన్నా ముందుగా ఒక యూ ట్యూబ్ ఛానల్‌ని ప్రారంభించాలని అనుకుంటున్నాడు. దీనికి వచ్చిన రెస్పాన్స్ బట్టి టివీ చానల్ గురించి ఆలోచిస్తాడట. ఏమైనా పవన్ పక్కా రాజకీయ నాయకుడిగా ఆలోచిస్తున్నాడు.