నందమూరి బాలకృష్ణ 100 వ సినిమాను చాలా ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న సంగతి తెలిసిందే. అమరావతిని పాలించిన ‘గౌతమి పుత్ర శాతకర్ణి’ చరిత్రను తెరకెక్కించే గొప్ప ప్రయత్నాన్ని చేస్తున్నాడు. క్రిష్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాని ఈ నెల 22 న ప్రారంభించాలని ప్లాన్ చేసారు. ఈ ప్రారంభోత్సవానికి ఇప్పటి వరకు బాలకృష్ణతో పనిచేసిన 99 దర్శకులను పిలుస్తున్నారు. వారందరికి ఆహ్వానాలు పంపించారని సమాచారం.
బాలయ్య మీసం మేలేసిన,తోడ కొట్టిన అదో సెన్షేషన్.. ఇప్పటిదాకా 99 సినిమాలతో అభిమానులను అలరించిన బాలయ్య తన వందో సినిమాను చరిత్రలో నిలిచిపోయేలా గౌతమిపుత్ర శాతకర్ణితో రాబోతున్నాడు. సినిమా టైటిల్ కూడా ‘గౌతమిపుత్ర శాతకర్ణి’గా పెట్టినట్టు తెలుస్తుంది. మరి బాలయ్య ఎంతో ప్రత్యేక శ్రద్ద, ఉత్సాహం చూపిస్తున్న వందో సినిమా ఎన్ని సంచలనాలు సృష్టిస్తుందో వేచి చూడాలి.