Latest News

Powered by Blogger.
Wednesday, 30 March 2016

చేతులు మృదువుగా ఉండాలంటే....స్పా ట్రీట్‌మెంట్‌

ఒక వెడల్పాటి గిన్నెలో గోరువెచ్చని నీటిని పోసి,దానిలో కొంచెం నిమ్మరసం పిండాలి. ఆ నీటిలో చేతులను మోచేతుల వరకు ముంచి 5 నిముషాలు ఉంచాలి.

ఆ తర్వాత నిదానంగా స్క్రబ్‌ చేయాలి. అయితే గోళ్ళ చుట్టూ స్క్రబ్‌ చేసేటప్పుడు కొంచెం జాగ్రత్తగా ఉండాలి. స్క్రబ్‌ ఇంటిలో తయారుచేసుకోవచ్చు. లేదా మార్కెట్ లో కొనవచ్చు.

ఆ తర్వాత గోళ్ళను కత్తిరించి మృత కణాలను తొలగించాలి.

ఒక క్యాప్సూల్‌ విటమిన్‌-ఇ ఆయిల్,ఒక స్పూన్ ఆలివ్ ఆయిల్ రెండింటిని కలిపి గోరువెచ్చగా చేయాలి. నూనెతో చేతులకు నిదానంగా 5 నిమిషాల పాటు మసాజ్ చేయాలి.

బఫర్‌తో గోళ్లను రుద్దాలి. క్యుటికిల్‌ పుషర్‌తో గోరు చుట్టూ ఉండే చర్మాన్ని (క్యుటికిల్‌) నెమ్మదిగా నెట్టాలి. చివరగా క్యుటికిల్‌ ఆయిల్‌ రాసి వేళ్లపై సున్నితంగా మసాజ్ చేయాలి.

మొదట బేస్‌ కోట్‌ వేసి ఒక నిమిషం ఆరాక మనకు నచ్చిన నెయిల్ పాలిష్ వేసుకోవచ్చు.

ఈ విధంగా మానిక్యూర్‌ చేసుకోవటానికి సమయం లేకపోతే వంటింటిలో సులభంగా అందుబాటులో ఉండే కూరగాయలతో చేతులను మృదువుగా చేసుకోవచ్చు. అది ఎలా అని ఆలోచిస్తున్నారా? బంగాళాదుంప, దోసకాయ, బొప్పాయి వంటి రసాలను చేతులకు రాసుకొని నెమ్మదిగా మసాజ్ చేయాలి. పాలలో కొన్ని చుక్కల నూనె, పావు స్పూన్ పంచదార, ఏదైనా పండ్ల గుజ్జు వేసి బాగా కలిపి చేతులకు రాసి పావు గంట అయ్యాక శుభ్రం చేసుకోవాలి. ఆ తర్వాత చేతులకు మాయిశ్చరైజర్‌ రాయాలి.

  • Title : చేతులు మృదువుగా ఉండాలంటే....స్పా ట్రీట్‌మెంట్‌
  • Posted by :
  • Date : 6:00 am
  • Labels :
  • Blogger Comments
  • Facebook Comments
Top