Latest News

Powered by Blogger.
Wednesday, 30 March 2016

చెమట దుర్వాసన పోయి ఫ్రెష్‌గా ఉండాలంటే....

ఎండకాలంలో చెమటలు పట్టటం సహజమే. అయితే ఈ చెమట కారణంగా శరీరం దుర్వాసన వస్తుంది. ఈ దుర్వాసన రాకుండా ఉండాలంటే కొన్ని ఇంటి చిట్కాలను పాటిస్తే సరిపోతుంది.

ప్రతి రోజు తప్పనిసరిగా ఉదయం,సాయంత్రం స్నానం చేయాలి.

చెమట ఎక్కువగా ఉంటుంది కాబట్టి చంకల కింద యాంటి బాక్టీరియల్‌ సోప్‌ తో రుద్ది వేడినీళ్లతో శుభ్రం చేయాలి.

వేసవికాలంలో తేమను ఎక్కువగా పీల్చే వస్త్రాలనే వాడాలి.

కొన్ని ఆహారాలను తీసుకోవటం వలన చెమట దుర్వాసన రావచ్చు. అందువల్ల కెఫైన్‌, మసాలా వంటలు, ఆల్కహాల్‌, శాచ్యురేటెడ్‌ ఫ్యాట్స్‌, సుగర్‌, సిగరెట్స్‌, కూల్‌డ్రింక్స్‌ వంటి ఆహారాలకు దూరంగా ఉండాలి.

ఆపిల్ సైడర్ వెనిగర్ చర్మం యొక్క Ph స్థాయిలను తగ్గిస్తుంది. అందువల్ల యాపిల్ సైడర్ వెనిగర్ లో కాటన్ బాల్ ముంచి చంకల కింద రాస్తే చెమట దుర్వాసన తగ్గుతుంది.

నిమ్మకాయ కూడా చెమటకు కారణం అయిన బాక్టీరియాను చంపేస్తుంది. అందువల్ల నిమ్మచెక్కను తీసుకోని చంకల కింద బాగా రుద్దాలి. కొంచెం సేపు అయ్యాక చల్లని నీటితో శుభ్రం చేసుకోవాలి.

తులసి,వేపలో యాంటిబాక్టీరియల్‌ లక్షణాలు సమృద్దిగా ఉండుట వలన చెమట దుర్వాసనను తగ్గించటంలో ప్రభావవంతంగా పనిచేస్తుంది. వేప,తులసి ఆకులను పేస్ట్ గా చేసి స్నానానికి వెళ్ళే ముందు చంకల్లో రాసుకొని కొంచెం సేపు అయ్యాక స్నానం చేయాలి. ఈ విధంగా కొన్ని రోజుల పాటు చేస్తే మంచి పలితం కనపడుతుంది.

  • Blogger Comments
  • Facebook Comments
Top