Latest News

Powered by Blogger.
Monday, 14 March 2016

పాదాల పగుళ్ళకు చెక్ పెట్టాలంటే....కొన్ని సూచనలు

సాదారణంగా ప్రతి ఒక్కరు ఏదో ఒక సమయంలో పాదాల పగుళ్లతో ఇబ్బంది పడుతూ ఉంటారు. ఈ సమస్యకు కొన్ని సూచనలను పాటిస్తే పగుళ్లకు చెక్ పెట్టవచ్చు.

ప్రతి రోజు ఉదయం సాయంత్రం పాదాలను శుభ్రం చేసుకోవాలి. ఈ విధంగా చేయడం వల్ల మురికి దూరం అవటమే కాకుండా ... నరాలు ఉత్తేజితమై రక్తప్రసరణ కూడా సక్రమంగా జరిగి పాదాల నొప్పులు తగ్గుతాయి.

పాదాలను ఎప్పుడు పొడిగా ఉండేలా చూసుకోవాలి. ముఖ్యంగా బాత్రూం నుంచి బయటకు వచ్చేటప్పుడు తప్పనిసరిగా... పొడిగా తుడుచుకున్నాకే బయటకు రావాలి. ఈ విధంగా చేయడం వల్ల స్నానాల గదిలోని ఫంగస్‌ బయటకు రావు. అంతేకాక వాటి వల్ల సమస్యలు తలెత్తవు.

చాలామందికి సాక్సులు వేసుకునే అలవాటు ఉంటుంది. అలాంటి వారు కాటన్‌ సాక్సులను మాత్రమే ధరించాలి. కాటన్ సాక్స్ లు అయితే చెమటను పీల్చి.. దుర్వాసన రాకుండా చూస్తాయి.

పాదాలను తరచుగా ఉప్పు నీటిలో పెడితే మృత కణాలు తొలగి పగుళ్ళు రాకుండా ఉంటాయి. అలాగే గోళ్ళను కూడా తీసేస్తూ ఉండాలి.

పాదాలు ఎప్పుడు తేమగా ఉండేలా చూసుకోవాలి. తేనే,రోజ్ వాటర్ సమాన బాగాల్లో తీసుకోని బాగా కలిపి పాదాలకు రాసి పది నిమిషాల తర్వాత గోరువెచ్చని నీటితో శుభ్రం చేయాలి. ఈ విధంగా తరచుగా చేస్తూ ఉంటే పాదాలు తేమగా మారతాయి.

  • Blogger Comments
  • Facebook Comments
Top