మొటిమలు పోగొట్టే టూత్ పేస్ట్
ముఖం మీది మొటిమలకు టూట్ పేస్ట్ రాస్తే తగ్గుతాయని అనుకుంటారు. ఈ చిట్కా నిజంగా పనిచేస్తుందా అంటే...ఈ విధంగా చేయడం అంత మంచిది కాదని అంటున్నారు నిపుణులు. మొటిమలపై టూట్ పేస్ట్ రాయటం వలన చర్మం పొడిబారి, ఆ ప్రాంతంలో దురద పుడుతుంది. అంతేకాక టూట్ పేస్ట్ రాయటం వల్ల మొటిమలు పోవడం అనేదే లేదు. దానికి బదులు సాలిసిలిక్ ఆమ్లం లేదా బెంజైల్ పెరాక్సైడ్ ఉన్న ఉత్పత్తులను వాడితే మొటిమల్ని ప్రభావంతంగా తగ్గించొచ్చు. ఒకవేళ మొటిమలు మరీ ఎక్కువగా ఉంటే నిపుణుల్ని కలిసి సరైన చికిత్స తీసుకోవాలి.
కంటికి కీరదోస
కంటి చుట్టూ ఉండే నల్లటి వలయాల్ని పోవటానికి కీరదోస ముక్కలు చాలా బాగా పనిచేస్తాయి. కీర దోసకాయ ముక్కలు కళ్లకు చల్లదనాన్ని ఇస్తాయి. అలాగే నలుపు రంగు విరిగిపోయేలా చేసి, చర్మాన్ని మృదువుగామారుస్తాయి. కీర ముక్కల్ని కంటి మీద పది నుంచి పదిహేను నిమిషాల పాటు ఉంచాలి. కీరదోస రసం కూడా నల్లటి వలయాలకు ప్రభావంతంగా పనిచేస్తుంది. ఈ రసంలో రెండు దూది ఉండలు ముంచి కళ్ల మీద పెట్టి పావుగంట సేపు ఉంచాలి. ఈ విధంగా క్రమం తప్పకుండా చేస్తే మంచి ఫలితం ఉంటుంది.
నిమ్మరసంతో చుండ్రు మాయం
చుండ్రు అనేది ఫంగస్ వల్ల వస్తుంది. నిమ్మలో యాంటీ ఫంగల్ గుణాలు సమృద్దిగా ఉంటాయి. నిమ్మరసంలో పెరుగు లేదా నూనె కలిపి మాడుకి పెట్టుకోమని కొంత మంది చెప్పుతూ ఉంటారు. ఏ విధంగా వాడినప్పటికీ నిమ్మరసం వల్ల చుండ్రు తగ్గడం మాత్రం ఖాయం. నిమ్మలో ఉండే ఆమ్ల గుణం శరీరంలోని PH స్థాయిని స్థిరంగా ఉంచి చుండ్రుని తగ్గిస్తుంది. అంతే కాకుండా యాపిల్ సిడర్ వెనిగర్, ఆలివ్ నూనెల వల్ల కూడా చుండ్రు తగ్గిపోతుంది.
మేకప్ తొలగించేందుకు బేబీ ఆయిల్
సాధారణం చర్మం, పొడిచర్మం గలవారు మేకప్ తొలగించటానికి బేబీఆయిల్‌ను వాడొచ్చు. మేకప్ ఉత్పత్తులు నూనె ఆధారితంగా ఉంటాయి కాబట్టి నూనెతో అయితే సులువుగా వాటిని తొలగించటానికి వీలు అవుతుంది. అయితే జిడ్డు చర్మం, మొటిమలు ఉన్న వాళ్లు మాత్రం ఈ విధానానికి దూరంగా ఉండాలి. బేబీ ఆయిల్ వాడడం వల్ల చర్మం మీద జిడ్డు పొర ఏర్పడుతుంది. బేబీ ఆయిల్ వాడకుండా నేరుగా ఫేస్‌వాష్‌తో ముఖం శుభ్రం చేసుకుంటే చర్మంమీద సహజసిద్ధంగా ఉన్న తేమ తొలగిపోతుంది. దానివల్ల చర్మం పొడిబారిపోతుంది.