Latest News

Powered by Blogger.
Thursday, 24 March 2016

అవకాడో నూనెను వంటల్లో ఎలా వాడాలి?

అవకాడో పండ్ల నుంచి తీసే ఈ నూనెను ఎక్కువగా విదేశీ వంటకాల్లో వాడుతూ ఉంటారు . న్యూజిలాండ్‌, ఆస్ట్రేలియా దేశాలలో ఆలివ్‌ సీజన్‌లో ఆలివ్‌ నూనెను మిగతా రోజులు అన్నీ అవకాడో నూనెను వంట నూనెగా ఉపయోగిస్తారు . సౌందర్య సాధనాల తయారీలో ఉపయోగించే ఈ నూనెతో అనేక ఆరోగ్యప్రయోజనాలు ఉన్నాయి. 

100గ్రా అవకాడో నూనెలో ఉన్న పోషక విలువలు
శాచురేటెడ్‌ ఫ్యాట్‌ - 12గ్రా
మోనోశాచురేటెడ్‌ ఫ్యాట్‌ - 71గ్రా
పాలీఅన్‌శాచురేటెడ్‌ ఫ్యాట్‌ - 13గ్రా
కాలరీలు - 884

ప్రత్యేకతలు
అవకాడో నూనె క్యారియర్‌ నూనెగా పని చేస్తుంది. అంటే పదార్ధాల్లోని పోషకాలను పీల్చుకోవటంలో ఎక్కువ సామర్ధ్యంను కలిగి ఉంటుంది. మరీ ముఖ్యంగా కెరోటినాయిడ్స్‌ను ఈ నూనె క్యారీ చేస్తుంది. ఎక్స్‌ట్రా వర్జిన్‌ ఆలివ్‌ నూనె వలే కోల్డ్‌ ప్రెస్‌డ్‌ అవకాడో నూనె లేత పసుపు రంగులో ఉండి మంచి రుచి, వాసన కలిగి ఉంటుంది.దీనిలో మోనోశాచురేటెడ్‌ ఫ్యాట్స్‌, విటమిన్‌ ఇ సమృద్దిగా ఉంటాయి.
ఆరోగ్యపరమైన ప్రయోజనాలు
సోయాబీన్‌ నూనెతో ఈ నూనెను కలిపి వంటల్లో వాడితే కీళ్ల నొప్పులు తగ్గుతాయి.
దీన్లోని విటమిన్‌ బి12 సోరియాసిస్ ని తగ్గించటానికి సహాయపడుతుంది.
ఈ నూనెను క్రమం తప్పకుండా వంటల్లో వాడితే BMI, పొట్టలో కొవ్వు తగ్గుతుంది.
దీనిలో యాంటీఆక్సిడెంట్స్ సమృద్దిగా ఉండుట వలన రోగనిరోధక శక్తి రెట్టింపవుతుంది.

వంటకాల్లో ఎలా వాడాలి
ఈ నూనెను సాటింగ్‌, పాన్‌ ఫ్రైయింగ్‌కు ఉపయోగించొచ్చు.
బేకింగ్‌కు, డ్రిజ్లింగ్‌కు కూడా వాడొచ్చు.
ఈ నూనెలో మాంసం నానబెట్టి వండవచ్చు.
అన్ని రకాల కూరగాయల వంటకాల్లోను ఉపయోగించవచ్చు.
అత్యధిక స్మోకింగ్‌ పాయింట్‌ కలిగిన నూనె కాబట్టి డీప్‌ ఫ్రైలకు కూడా వాడవచ్చు.

      • Blogger Comments
      • Facebook Comments
      Top