Latest News

Powered by Blogger.
Thursday, 24 March 2016

ఎండ వల్ల ముఖం జిడ్డుగా మారితే.... చిన్న చిట్కా

ఎండ వల్ల ముఖం జిడ్డుగా మారుతుంది. అలాగే దుమ్ము, ధూళి పడి చర్మం మీద దురద రావడం, నల్లబడటం వంటి సమస్యలు వస్తూనే ఉంటాయి. వీటికి పరిష్కారంగా... రెండు టీ స్పూన్ల క్యారెట్ తురుములో టీ స్పూన్ తేనె కలపాలి. ఈ మిశ్రమాన్ని రెండు చుక్కల ఎసెన్షియల్ ఆయిల్ కలిపి ముఖానికి రాసి మృదువుగా మసాజ్ చేసి, పదిహేను నిమిషాల తర్వాత చల్లని నీటితో శుభ్రం చేసుకోవాలి. ఈ విధంగా చేయడం వల్ల చర్మానికి జీవకాంతి లభిస్తుంది.

మూడు స్పూన్ల దోసరసం, ఒక స్పూన్ పెరుగు, రెండు స్పూన్ల కలబంద జెల్ కలిపి ముఖానికి, మెడకు రాసి పదిహేను నిమిషాల తర్వాత శుభ్రం చేసుకోవాలి. ఎండ వల్ల కందిపోయిన, రసాయనాల వల్ల ర్యాష్ ఏర్పడిన చర్మానికి ఈ ప్యాక్ సహజమైన సౌందర్య లేపనంలా పనిచేస్తుంది. దోస లేదా కీరా రసంలో పచ్చి పాలు కలిపి చర్మానికి రాయాలి. ఆరిన తర్వాత శుభ్రం చేసుకోవాలి. ఎండ వల్ల కమిలిన చర్మం వెంటనే సాధారణ రంగులోకి మారిపోతుంది.

  • Title : ఎండ వల్ల ముఖం జిడ్డుగా మారితే.... చిన్న చిట్కా
  • Posted by :
  • Date : 5:44 am
  • Labels :
  • Blogger Comments
  • Facebook Comments
Top