సాధారణంగా మనం ఒకే రకమైన వంట నూనెను వాడుతూ ఉంటాం. కానీ ఒక్కో వంట నూనెలో ఒక్కో రకమైన పోషకాలు ఉంటాయి. మరి అన్ని రకాల పోషకాలు మనం పొందాలంటే ఏమి చేయాలి? రెండు రకాల నూనెలను కలిపి వంటల్లో వాడవచ్చా? అయితే ఎలా వాడాలో తెలుసుకుందాం.
స్మోకింగ్ పాయింట్
స్మోకింగ్ పాయింట్ అనేది ఒక్కో నూనెకు ఒక్కో రకంగా ఉంటుంది. అందువల్ల రెండు నూనెలను కలపాలని అనుకున్నప్పుడు ఆ రెండు నూనెల స్మోకింగ్ పాయింట్స్ దగ్గరగా ఉండేలా చూసుకోవాలి. ఈ విధంగా కలిపి వాడే నూనెలను డీప్ ఫ్రైలకే వాడటం మంచిది.
పోషకాలు
ఒక్కో నూనెలో ఒక్కో రకమైన పోషకాలు ఉంటాయి. అవసరానికి మించి ఎక్కువగా వేడి చేస్తే కొన్ని నూనెల్లో పోషకాలు నశిస్తాయి. పలచగా ఉండే పామాయిల్ వంటి నూనెలు గది ఉష్ణోగ్రత వద్ద ఘన రూపంలోకి మారతాయి. కాబట్టి వంట నూనెలను కలిపే సమయంలో ఈ విషయాన్నీ గుర్తుంచుకోవాలి.
రుచుల్లో తేడాలు
ఒక్కో నూనెకు ఓ ప్రత్యేకమైన రుచి ఉంటుంది. రెండు నూనెల్ని కలిపినప్పుడు రుచుల్లో తేడా రావొచ్చు. ఆశించిన పరిమళం వంటకాలకు అబ్బకపోవచ్చు. కాబట్టి వాడే నూనెల రుచుల మీద అవగాహన ఏర్పరుచుకుని ఆ తర్వాతే కలిపి వండాలి.
కొబ్బరి నూనె + ఆలివ్ ఆయిల్
ఈ రెండు నూనెల్లో పోషకాలు చాలా సమృద్దిగా ఉంటాయి. రెండిటిలోని పోషకాలు సొంతమవ్వాలంటే రెండిటిని సమాన బాగాల్లో కలపాలి. మొదట తక్కువ మొత్తంలో కలుపుకుని సీసాలో నిల్వ చేసుకుని వాడి చూడాలి. రుచి నచ్చితే అదే విధంగా కంటిన్యూ చేయొచ్చు.
ఆవ నూనె + నువ్వుల నూనె
ఆవ నూనె ఘాటుగా ఉంటుంది. నేరుగా వాడలేం కాబట్టి దీన్ని నువ్వుల నూనెతో కలిపి వాడవచ్చు. కూరలు, పచ్చళ్లకు ఈ నూనెలు చాలా అనుకూలంగా ఉంటాయి.
వేరుశనగ నూనె + సన్ఫ్లవర్ ఆయిల్
వేరుశనగ నూనెలో కొవ్వులు అధికం. అలాగని ఆ నూనె అందించే రుచిని పూర్తిగా వదులుకోలేం. అందువల్ల ఈ నూనెను పొద్దు తిరుగుడు నూనెతో కలిపి వాడుకుంటే కొంతలో కొంత మంచి జరుగుతుంది.
రైస్ బ్రాన్ + అవిసె నూనె
అవిసె నూనె వాడటం మొదటిసారైతే ఈ నూనెను రైస్బ్రాన్తో కలిపి వాడటం మంచిది. ఈ రెండు నూనెలను కలిపి వాడటం వల్ల కూరలకు కొత్త రుచి వస్తుంది.
ఇలా కలపాలి
కలపాలనుకున్న నూనెలను గిన్నెలో వేసి బాగా గిలక్కొట్టాలి. తర్వాత సీసాలో నింపి గాలి చొరబడకుండా మూత పెట్టాలి. ఈ విధంగా తయారుచేసి పెట్టుకున్న నూనె సీసాను ఉపయోగించబోయే ప్రతిసారీ బాగా కుదపాలి. అలాగే ఎక్కువ కాలంపాటు కదపకుండా ఉంచితే సీసాలోని నూనెలు వేరవుతాయి. కాబట్టి తరచుగా సీసాను కదిలిస్తూ ఉండాలి.