ఎదుగుదలకు ఐరన్, క్యాల్షియం, ఫాస్పరస్ వంటి ఖనిజాలు చాలా అవసరం. ఈ పోషకాలన్నీ బెల్లంలో సమృద్దిగా లభిస్తాయి. అందువల్ల బెల్లంను రోజువారీ ఆహారంలో భాగంగా చేసుకుంటే ఎముకలు బలంగా తయారవటంతో పాటు అనేక రకాల ఉపయోగాలు ఉన్నాయి.
బెల్లం ఆహారపదార్థాలకు రుచిని ఇవ్వటంతో పాటు ఆరోగ్యానికి కూడా చాలా మేలును చేస్తుంది. మరీ ముఖ్యంగా పిల్లలకి మంచి ఔషధం. దీనిలోని పోషకాల వల్ల పిల్లల్లో రక్తహీనత, జీర్ణ సంబంధ సమస్యలు దూరంగా ఉంటాయి. బెల్లంలో ఐరన్ అధికంగా ఉండుట వలన రక్తంలో హిమోగ్లోబిన్ శాతం తగ్గిపోకుండా ఉంటుంది. అలాగే బెల్లం తీసుకోవడం వలన జీర్ణక్రియ మెరుగవుతుంది. దీనిలోని మినరల్స్ జీర్ణక్రియలో తోడ్పడే ఎంజైమ్స్ ఉత్పత్తికి సహాయపడతాయి. అందువల్ల పిల్లలకి మలబద్ధకం సమస్య రాదు.
బెల్లాన్ని రోజువారీ ఆహారంలో భాగం చేయడం వలన పిల్లల ఎదుగుదలకు, ఎముకల బలానికి కావలసిన క్యాల్షియం, ఫాస్పరస్ వంటి పోషకాలు సమృద్దిగా అందుతాయి. అంతేకాకుండా బెల్లంలో వ్యాధినిరోధక శక్తికి తోడ్పడే యాంటాక్సిడెంట్లు, జింక్, సెలీనియం వంటి న్యూట్రిషన్స్ కూడా ఎక్కువగానే ఉంటాయి. అందువల్ల పిల్లల్లో ఫ్లూ, జలుబు వంటి వాటిని తగ్గించడానికి కూడా బెల్లం ఉపయోగపడుతుంది. అయితే ఏదైనా మితంగా తింటేనే మందుగా పనిచేస్తుంది. అందువల్ల బెల్లం తీసుకుంటే మంచిది కదా అని ఎక్కువగా తినకూడదు. అందుకని పిల్లలకు రోజూ ఆహారంలో కొద్ది పరిమాణంలో మాత్రమే పెట్టాలి.