Latest News

Powered by Blogger.
Monday, 15 February 2016

ప్రతి రోజు ఎంత ఉప్పు......అవసరం అవుతుంది?

ఉప్పులో సోడియం క్లోరైడ్‌ ఉంటుంది. ఈ లవణం శరీరానికి చాలా అవసరం. సోడియం నరాల పనితీరును క్రమబద్దీకరణలో సహాయపడుతుంది . కండరాల సంకోచ, వ్యాకోచానికీ తోడ్పాటును అందిస్తుంది. అలాగని ఎక్కువగా తిన్నా ప్రమాదమే. దీని వినియోగం పెరిగే కొద్దీ అనేక రకాల సమస్యలు వస్తాయి. ఇది మెదడు మీద మాత్రమే కాకుండా మూత్రపిండాల పని తీరుపైనా కూడా ప్రభావం చూపుతుంది. ఉప్పు ఎక్కువగా ఉన్న పదార్థాలు తినడం వల్ల మూత్రపిండాల పనితీరు దెబ్బతింటుంది. కొన్నిసార్లు అతిగా ఉప్పు తీసుకోవడం వల్ల ఎముకలు బలహీనం అవుతాయని కొన్ని అధ్యయనాలు చెబుతున్నాయి. 

దాంతో మెనోపాజ్‌ దాటాక ఆస్టియోపోరోసిస్‌ వచ్చే ప్రమాదం ఎక్కువ అవుతుంది. కొందరిలో అధిక రక్తపోటు మొదలై.. దాన్ని అదుపులో ఉంచుకోకపోతే గుండె సమస్యలూ వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఇవన్నీ ఒకెత్తయితే అధిక సోడియం వల్ల శరీరం ఉబ్బుతుంది. ముఖ్యంగా కాళ్లూ చేతులూ, పాదాల్లో నీరు చేరి ఆ భాగాలు ఉబ్బినట్లు కనిపిస్తాయి. అల్సర్లూ రావచ్చు. ఇలాంటి సమస్యలన్నీ అదుపులో ఉంచాలంటే ఉప్పు వినియోగాన్ని తగ్గించుకోవాలి.

ప్రతి మనిషికి రోజులో ఆరు గ్రాముల ఉప్పు అంటే.. ఒక స్పూన్ సరిపోతుంది. దాన్ని గమనించుకుంటూ తక్కువ వేసుకోవడం మొదలు పెట్టాలి. ప్రిజర్వేటివ్‌లు ఉన్న పదార్థాలు చాలా తక్కువగా తినాలి. అంటే పచ్చళ్లూ, అప్పడాలు వంటి వాటిల్లో ఉప్పు శాతం ఎక్కువగా ఉంటుంది. అందువల్ల వాటి వినియోగాన్ని తగ్గించాలి.

కొన్ని పదార్థాల్లో ఉప్పును తగ్గించి, వాటికి బదులు నిమ్మరసం పిండుకోవచ్చు. అలాగని పూర్తిగా మానేయాలని లేదు. రోజు మొత్తానికి అర స్పూన్ తీసుకుంటే సరిపోతుంది. కొందరు మహిళలకు చెమట ఎక్కువగా పడుతుంది. ఇలాంటి వారికి కొంత సోడియం అవసరం. ముఖ్యంగా గర్భిణులకు తప్పనిసరి కాబట్టి మోతాదు మించకుండానే తీసుకోవాలి.

  • Title : ప్రతి రోజు ఎంత ఉప్పు......అవసరం అవుతుంది?
  • Posted by :
  • Date : 9:47 am
  • Labels :
  • Blogger Comments
  • Facebook Comments
Top