Latest News

Powered by Blogger.
Tuesday, 5 January 2016

వయసు పెరిగి కండరాలు బాగా బలహీనపడ్డాయా?

వయసు పెరిగి కండరాలు బాగా బలహీనపడ్డాయా? అయితే దీనికి ఒక సులభమైన చిట్కా ఉంది. ఈ సమస్య తీవ్రంగా ఉంటే యాపిల్‌, గ్రీన్‌ టొమాటోలు బాగా తినాలి. వీటిని తింటే కండరాల బలహీనత తగ్గుతుంది. కండరాల సమస్యల పరిష్కారం కొరకు వీటిలోని రసాయనాలు సహాయపడతాయి.

కండరాల బలహీనతకు కారణం అవుతున్న ప్రోటీన్ కనుగొనే ప్రయత్నంలో ఎటిఎఫ్‌ఎ4 అనే ప్రొటీన్‌ కండరాల్లో మార్పుకు కారణం అవుతుందని కనుగొన్నారు. యాపిల్‌ పండు తొక్కలో ఉర్సోలిక్‌ యాసిడ్‌ ఉండడాన్ని కూడా శాస్త్రవేత్తలు గమనించారు. అలాగే గ్రీన్‌ టొమాటోల్లో టొమాటైడైన్‌ ఉండడాన్ని గుర్తించారు. ఇవి రెండూ కూడా కండరాలు దెబ్బతినకుండా నివారిస్తాయని ఈ పరిశోధనలో శాస్త్రవేత్తలు గుర్తించారు. అంతేకాకుండా కండరాల బలహీనతను పోగొట్టడంలో ఇవి కీలకంగా వ్యవహరిస్తాయని కూడా తేలింది. శరీరానికి సరైన యాక్టివిటీ లేకపోవడం మరియు వయసు పెరగడం వంటి కారణాల వల్ల కండరాలు బలహీనంగా మారతాయి.

కండరాల్లోని బలహీనతను తగ్గించడానికి కావాల్సిన లక్షణాలు యాపిల్‌, టొమాటాల్లోని ఉర్సోలిక్‌ యాసిడ్‌, టొమాటైడైన్‌లలో సమృద్దిగా ఉన్నాయి.వయసు వల్ల తలెత్తిన కండరాల బలహీనత, యాట్రోఫీ ఉర్సోలిక్‌ యాసిడ్‌, టొమాటైడైన్‌ల వల్ల తగ్గుతుందని తేలింది. మొత్తానికి యాపిల్‌, టొమాటోల వాడకం వల్ల కండరాల మాస్‌ 10 శాతం పెరిగింది. ఇంకో ముఖ్యమైన విషయం ఏమిటంటే కండరాల దృఢత్వం, నాణ్యతలు కూడా 30 శాతం పెరిగాయి. సో... వీటి సహాయంతో వృద్ధాప్యంలో తలెత్తే కండరాల బాధల నుంచి మనం సులభంగా బయట పడవచ్చు.

  • Blogger Comments
  • Facebook Comments
Top