Latest News

Powered by Blogger.
Tuesday, 5 January 2016

తులసితో ఫేస్‌ ప్యాక్స్‌ తయారుచేసుకుందామా?

తులసి అనేది ఆరోగ్యానికి ఎలా సహాయపడుతుందో మనకు తెలిసిన విషయమే. అలాగే అందానికి కూడా బాగా సహాయపడుతుంది. తులసి ఆకులతో చాలా రకాల ఫేస్‌ ప్యాక్స్‌ ని సులభంగా తయారు చేసుకోవచ్చు. ఇవి ముఖానికి చక్కని కాంతితో పాటు తాజాదనాన్ని కూడా ఇస్తుంది. ఇప్పుడు తులసితో ప్యాక్స్ తయారి గురించి వివరంగా తెలుసుకుందాం.

తులసి, పెరుగు
తాజా తులసి ఆకుల్ని తీసుకుని ఇంటి లోపల నాలుగు రోజులు ఆరబెట్టాలి. ఆ తర్వాత తులసి ఆకుల్ని మిక్సీ చేసి పొడిగా చేసుకోవాలి. ఆ తులసి పొడిని తీసుకుని దానికి సరిపడా పెరుగు కలపాలి. ఆ మిశ్రమాన్ని ముఖానికి రాసి, అరగంట తర్వాత ముఖాన్ని శుభ్రం చేసుకోవాలి. దీని వలన పొడిబారిన చర్మం మృదువుగా మారటమే కాక పాటు మృతకణాలు కూడా తొలగిపోతాయి.

తులసి, శెనగపిండి
గుప్పెడు తులసి ఆకుల్ని తీసుకుని కొంచెం నీటిని కలిపి మెత్తని పేస్ట్ గా చేయాలి. ఆ తర్వాత ఆ పేస్ట్ లో కొంచెం శనగపిండి, మూడు చుక్కల తేనెను కలపాలి. ఆ మిశ్రమాన్ని ముఖానికి రాసి పదిహేను నిమిషాల తర్వాత శుభ్రపరచాలి. ఈ ఫేస్‌ ప్యాక్‌ వల్ల ముఖానికి కూలింగ్‌ ఎఫెక్ట్‌ వస్తుంది.

తులసి, వేప
తులసి, వేప ఆకుల్ని సమానంగా తీసుకోని పేస్ట్‌ చేయాలి. ఈ పేస్ట్‌ కళ్లల్లో పడకుండా ముఖానికి అప్లై చేయాలి. అరగంట తర్వాత ముఖాన్ని చల్లటి నీళ్లతో శుభ్రపరుచుకుంటే నొప్పులతో పాటు ముఖంపై ఉండే నల్లని చుక్కలు కూడా మాయం అయిపోతాయి.

తులసి, ఓట్‌మీల్‌
తులసి ఆకుల పేస్ట్ కి పాలతో పాటు ఓట్‌మీల్‌ కలిపి తయారు చేసిన ఫేస్‌ప్యాక్‌ ముఖానికి పట్టించాలి. అరగంట తర్వాత ముఖాన్ని శుభ్రపరచాలి. నాలుగు వారాల్లో ముఖ చర్మం మృదువుగా మారుతుంది.

తులసి,ముల్తాన్‌ మట్టి
ఒక బౌల్‌లో రెండు స్పూన్ల తులసి పౌడర్‌ తీసుకుని అందులో ఒక టీ స్పూన్‌ ముల్తాన్‌ మట్టి కలపాలి. వీటికి కొంచెం పసుపు, రెండు చుక్కల ఆలివ్‌ ఆయిల్‌, రోజ్‌వాటర్‌ కలిపి ఈ మిశ్రమాన్ని ఫేస్‌కు అప్లై చేయాలి. ఇరవై నిమిషాల తర్వాత మంచినీళ్లతో ముఖాన్ని శుభ్రపరుచుకోవాలి. ఇలా చేస్తుంటే చర్మంలో ఫ్రెష్‌నెస్‌ వస్తుంది. 

  • Title : తులసితో ఫేస్‌ ప్యాక్స్‌ తయారుచేసుకుందామా?
  • Posted by :
  • Date : 7:00 am
  • Labels :
  • Blogger Comments
  • Facebook Comments
Top