చాలామంది ఆడవారు కొన్ని రకాల నొప్పుల్ని అశ్రద్ధ చేస్తుంటారు. కానీ అలా నిర్లక్ష్యం చేయడం వల్ల చిన్న చిన్న నొప్పులే ఆ తర్వాత పెద్ద పెద్ద సమస్యలుగా మారే అవకాశం ఉంది. అందుకే ఏ నొప్పిని ఎలా ట్రీట్ చేయాలో తెలుసుకుందాం.
నడుస్తున్నప్పుడో, పరుగెడుతున్నప్పుడో లేదా వ్యాయామం చేస్తున్నప్పుడు పొరపాటున కాలు మడత పడుతుంది. అప్పుడు చీలమండ దగ్గర కలిగే నొప్పి.. కొన్ని రోజులు విశ్రాంతి తీసుకోవడం, మర్దనా చేయడం, ఐస్ పెట్టడం వల్ల తగ్గిపోతుంది. ఆ నొప్పి తగ్గేవరకు తేలికపాటి వ్యాయామాలు మాత్రమే చేయాలి. స్విమ్మింగ్, సైక్లింగ్ వంటి వాటి జోలికి అసలు వెళ్ళకూడదు. అప్పటికీ తగ్గకపోతే వైద్యుల్ని సంప్రదించాలి.
ఒక్కోసారి అధిక బరువులు ఎత్తినపుడు వీపు భాగంలో ఎముకలు పట్టేసినట్టు అనిపిస్తుంటుంది. సరైన విధంగా బరువులు ఎత్తకపోతే ఆ విధంగా జరుగుతుంది. అలాంటి సమయంలో కొద్ది సేపు విశ్రాంతి తీసుకోవడం మంచిది. కానీ ఒకవేళ గాలి పీల్చుకోవడం కష్టం అనిపిస్తే మాత్రం వెంటనే డాక్టర్ ని సంప్రదించటం ముఖ్యం.
ఎక్కువ సేపు కంప్యూటర్ ముందు కూర్చొనే వాళ్లకి తరచూ నడునొప్పి వస్తుంటుంది. ఒకవేళ ఈ నొప్పి అధికంగా ఉంటే కొన్ని రోజులు వాకింగ్, ఎరోబిక్స్, వంటి వ్యాయామాలు చేయకుండా ఉండటమే మంచిది. ఐస్ పెట్టడం, చిన్నపాటి వ్యాయామాలతో తగ్గకపోతే వెంటనే డాక్టర్‌ని సంప్రదించాలి. ఇప్పుడు చెప్పుకున్న నొప్పుల్ని కొన్ని రోజుల పాటు నిర్లక్ష్యం చేయవచ్చు. కానీ నడుము కింద తొంటి భాగంలో వచ్చే నొప్పిని మాత్రం అశ్రద్ధ చేయకూడదు. యుక్తవయసులోని, మోనోపాజ్ దశలోని ఆడవారిలో ఈ రకమైన నొప్పి ఎక్కువగా ఉంటుంది.