ఆషాడ మాసం అనారోగ్య మాసం. ఈ మాసంలో విపరీతమైన గాలుల వలన దుమ్ము,ధూళి లేచి పరిసరాలను,నది తీర ప్రాంతాలను కలుషితం చేస్తుంది. దానికి తోడూ వ్యవసాయ పనులను ఈ నెలలోనే ప్రారంభిస్తారు. కొత్త పెళ్ళాంతో సుఖంగా ఇంటిలో ఉంటే ఆర్ధిక పరిస్థితి దెబ్బతింటుంది. అదే ఆడపిల్ల ఇంటికి అల్లుడు వస్తే మర్యాదలతో పొలం పనులు కుంటుపడతాయి.
దాంతో పాటు ఈ మాసంలో గర్భం ధరిస్తే ఆ బిడ్డ ఆరోగ్యంగా పుట్టడు. ఆషాడ మాసంలో గర్భం ధరిస్తే నెలలు నిండే సమయానికి ఎండలు ముదురుతాయి. దానితో తల్లి,కడుపులో బిడ్డ అవస్థలు పడతారని ఆషాడ మాసంలో ఇద్దర్నీ దూరంగా ఉంచుతారు.
అందువల్ల ఆషాడ మాసంలో భార్యకి దూరంగా ఉండటమే ఉత్తమం. అత్తాకోడళ్ళు ఓ గడప దాటకూడదని అంటారు. అందుకని భార్యను ఎత్తుకొని దాటించేవారు ఉన్నారు. శాస్త్రం నియమాలు పెట్టింది ఆచరించమని....అంతేకాని లొసుగులు వెతకమని కాదు.