Latest News

Powered by Blogger.
Thursday, 24 December 2015

కీళ్లనొప్పులకు.....యోగా పరిష్కారమా.....???

Keella Noppulu,Mokalla Noppulaku Yoga manchi remedy

ఈ రోజుల్లో ప్రతి ఒక్కరికి కీళ్ళ నొప్పులు,మోకాళ్ళ నొప్పులు రావటం సర్వ సాధారణం అయిపొయింది. ఈ బిజీ జీవితంలో వ్యాయామాలు చేయటానికి కూడా సమయం ఉండటం లేదు. అటువంటి వారికీ ఈ యోగా పరిష్కారం చూపుతుంది. కీళ్ల నొప్పులు, మోకాళ్ల నొప్పులకు యోగ ముద్రల ద్వారా మంచి ఉపశమనం కలుగుతుంది. ఆ నొప్పుల నుండి క్రమంగా బయట పడవచ్చు. ఏ వయసు వారైనా ఈ యోగా ముద్రలను చేయవచ్చు.

పద్మాసనంలోకాని, సుఖాసనంలో కాని అది కూడా వీలు కాకపోతే కుర్చీలో కాని కూర్చోని చేయవచ్చు. కాకపోతే వెన్ను నిటారుగా పెట్టటం ముఖ్యం. ఆ తర్వాత రెండు చేతుల చూపుడు వేలును బొటన వేలును సుతారంగా తాకించండి. దీనినే 'చిన్ముద్ర' అని అంటారు. ఈ ముద్రలో ఉన్న చేతులను తొడల మీద ఉంచి సుతారంగా గాలి పీల్చుతూ దీర్ఘ ఉఛ్వాసను దీర్ఘ నిశ్వాసను తీసుకోవాలి. ఈ విధంగా పదిహేను నిమిషాల పాటు చేయాలి.

ఆ తర్వాత ముద్రను మార్చాలి. ఈసారి బొటనవేలికి మధ్య వేలును ఉంగరం వేలును తాకించండి. దీనినే 'అపాన ముద్ర' అని అంటారు.ఈ ముద్రలో కూడా వెన్ను నిటారుగా పెట్టి దీర్ఘ ఉఛ్వాసను దీర్ఘ నిశ్వాసను తీసుకోవాలి. ఈ విధంగా పదిహేను నిమిషాల పాటు చేయాలి. ఈ విధంగా ప్రతి రోజూ చేస్తూ ఉంటే తప్పకుండా మలినాలు తొలగి కీళ్ల నొప్పుల నుంచి మోకాళ్ల నొప్పుల నుంచి ఉపశమనం పొందే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి.

  • Blogger Comments
  • Facebook Comments
Top