Latest News

Powered by Blogger.
Thursday, 24 December 2015

రాత్రి సమయంలో జంక్‌ఫుడ్‌ తింటే ముప్పా.... నిజామా....???

ratri samayamlo Junk Food tinte Muppa

రాత్రి సమయంలో జంక్‌ఫుడ్‌ తింటే ముప్పా అంటే అవుననే చెప్పాలి. నిద్ర పోవటానికి ముందు ఎక్కువగా ఆహారాన్ని తీసుకుంటే రక్తంలో చక్కెరశాతం పెరగటంతో పాటు కొవ్వు పదార్థాలు కూడా పెరిగి గుండె సమస్యలూ వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. అంతేకాక కొన్ని తాజా పరిశోదనల ప్రకారం మెదడు మీద కూడా తీవ్రమైన ప్రభావాన్ని చూపుతుందని తెలిసింది. ఎవరైనా అర్ధరాత్రి తిండి తింటుంటే ‘దెయ్యం తిండి తినటం మంచిది కాదు’ అని పెద్దవాళ్ళు అనటం మనం వింటూ ఉంటాం. వారు చెప్పింది అక్షరాల నిజమే. వేళా పాల లేకుండా ఆహారాన్ని తీసుకుంటే అనారోగ్యం దరి చేరుతుంది. అందుకే మన పెద్దవాళ్ళు వేళా పాల కానీ సమయంలో తినవద్దని చెప్పుతూ ఉంటారు.

బిజీ లైఫ్ లో ప్రతి ఒక్కరు వేళ కానీ వేళలో ఆహారం తీసుకోవటం చేస్తున్నారు. నగరాల్లో ఎక్కువగా రాత్రి పది దాటిన తర్వాత కూడా ఫ్రిజ్‌లో నిల్వ ఉంచిన ఆహారం, స్నాక్స్‌ తీసుకుంటూ ఉంటారు . టీవీని తదేకంగా చూస్తూ, సెల్‌ఫోన్‌లో నెట్‌ సర్ఫ్‌ చేస్తూ చిరుతిళ్లను తమకు తెలియకుండానే ఎక్కువగా లాగిస్తుంటారు. ఈ విధంగా కేవలం టైంపాస్‌ కోసం రాత్రి పూట తినే చిరుతిళ్లు, జంక్‌ఫుడ్‌ మెదడుపై అధిక ప్రభావాన్ని చూపుతాయని ఇటీవల జరిగిన పరిశోదనలో తేలింది. రాత్రి పడుకునే ముందు జంక్‌ఫుడ్‌, స్నాక్స్‌ తినే వారిలో మెదడు తీవ్ర ప్రభావానికి గురైందని తెలుసుకున్నారు. ముఖ్యంగా ఇలాంటి వారిలో జ్ఞాపకశక్తి అతి త్వరగా సన్నగిల్లుతుందని కూడా పరిశోదకులు హెచ్చరిస్తున్నారు.

  • Title : రాత్రి సమయంలో జంక్‌ఫుడ్‌ తింటే ముప్పా.... నిజామా....???
  • Posted by :
  • Date : 10:40 am
  • Labels :
  • Blogger Comments
  • Facebook Comments
Top