Latest News

Powered by Blogger.
Thursday, 24 December 2015

టైప్-1 డయాబెటిస్(మధుమేహం) అంటే ఏమిటి? ఎలాంటి లక్షణాలతో టైప్-1ను గుర్తించవచ్చు?

Type 1 Diabetes Cure Tips

సాధారణంగా 15 ఏళ్ల లోపు పిల్లల్లో వచ్చే చక్కెరవ్యాధిని టైప్-1 డయాబెటిస్ (మధుమేహం) అంటారు. టైప్-1 మధుమేహం అంటే ఇందులో క్లోమగ్రంథి అస్సలు పనిచేయదు. దాంతో క్లోమగ్రంథి తయారు చేయాల్సిన ఇన్సులిన్ శరీరంలో అస్సలు ఉండదు . అందువలన వీరికి ఇన్సులిన్ మాత్రలతో ప్రారంభించి ఆ తర్వాత కొంతకాలానికి ఇంజెక్షన్‌కు మారుస్తారు.

సి-పెప్టైడ్ అనే ప్రోటీన్ మోతాదు 0.3 నానోగ్రాము ఉంటే క్లోమగ్రంథి సక్రమంగా పనిచేస్తున్నది అని అర్ధం . 0.3 నానోగ్రాము కన్నా తక్కువ ఉంటే క్లోమగ్రంథి పనిచేయటం లేదని, టైప్-1 మధుమేహం ఉందని నిర్ధారణ చేయవచ్చు. అయితే కొందరిలో ఈ మోతాదు అటు ఇటులో ఉన్నా మధుమేహం వచ్చే అవకాశం ఉంది. అంటే ఇన్సులిన్ బాగానే ఉన్నా మధుమేహం వస్తే అది టైప్-2 మధుమేహం అని చెప్పవచ్చు. కాబట్టి పిల్లల్లో మధుమేహం ఉంటే నేరుగా ఇన్సులిన్ ఇవ్వకుండా సి-పెప్టైడ్ ఏ స్థాయిలో ఉందో నిర్ధారణ చేసుకొని మాత్రమే వైద్యం చేయాల్సి ఉంటుంది.

ఎలాంటి లక్షణాలతో టైప్-1ను గుర్తించవచ్చు?

టైప్-1 మధుమేహం హఠాత్తుగా వస్తుంది. రక్తంలో గ్లూకోజు స్థాయిలు ఆరు నెలల నుంచి పన్నెండు నెలల్లోపు 100 - 500 వరకు పెరగవచ్చు. వీరిలో అతి మూత్రం, ఆకలి, దాహం వేయడం, మూత్రవిసర్జనకు ఎక్కువసార్లు వెళ్ళటం వంటి లక్షణాలు కనపడతాయి. అంతేకాక రోగనిరోధకశక్తి తగ్గడం వలన తరచూ ఇన్ఫెక్షన్ల బారిన పడుతుంటారు. అలాగే ఎదుగుదల కూడా తగ్గుతుంది.

పాటించాల్సిన ఆహార నియమాలు

పిల్లల్లో ఎలాంటి ఆహార నియమాలుపాటించకూడదు. 15-25 మధ్య వయసువారు లావుగా ఉంటే మాత్రం బరువు తగ్గించే ప్రయత్నం చేయాలి. కొలెస్ట్రాల్ ఎక్కువ ఉంటే మాత్రం జంక్‌ఫుడ్ తగ్గించాలి. ఇన్సులిన్ నిరోధకత అనేది రక్తంలో ట్రైగ్లిజరైడ్స్‌ను పెంచుతుంది. కాబట్టి ట్రైగ్లిజరైడ్స్ ఎక్కువగా ఉంటే ఆహారంలో పిండిపదార్థాలను తగ్గించుకోవాలి. 5 - 15 ఏళ్ల పిల్లల డైట్ విషయంలో డైటీషియన్‌ను సంప్రదించి వారు చెప్పిన సలహాలను పాటించాలి. ఆహారం విషయంలో ఆంక్షలు విధించి ఆహారాన్ని తగ్గించి, వ్యాయామాలను ఎక్కువగా చేయిస్తే అసలే పిల్లల్లో తక్కువగా ఉండే రోగనిరోధకశక్తి మరింత తగ్గిపోతుంది. దాంతో క్షయవ్యాధి వచ్చే ప్రమాదం ఉంటుంది.

  • Title : టైప్-1 డయాబెటిస్(మధుమేహం) అంటే ఏమిటి? ఎలాంటి లక్షణాలతో టైప్-1ను గుర్తించవచ్చు?
  • Posted by :
  • Date : 9:48 am
  • Labels :
  • Blogger Comments
  • Facebook Comments
Top