బంగాళదుంప చెక్కు తీసి మెత్తని పేస్ట్ చేసి ఆ మిశ్రమానికి కొంచెం పసుపు కలిపి రాత్రి గోళ్లకు పట్టించి మరుసటి ఉదయాన్నే శుభ్రంగా కడగాలి. ఈ విధంగా చేయుట వలన ఫంగస్ వల్ల ఏర్పడిన నలుపుదనం పోయి గోళ్లు కాంతివంతంగా మారతాయి.
కొంచెం పసుపు తీసుకుని నీటితో గాని, నిమ్మరసంలో గాని కలిపి పేస్ట్ చేసి రాత్రి సమయంలో వ్యాధి సోకిన భాగాల్లో గోళ్లకు పట్టించి రాలిపోకుండా తెల్లని పలుచని గుడ్డను కట్టి మరుసటి రోజు ఉదయాన్నే కడిగేయాలి. ఈ విధంగా చేస్తుంటే గోళ్ల సమస్యలు త్వరగా తగ్గుతాయి.
రాత్రి పడుకునే ముందు పలుచని తెల్లగుడ్డను నిమ్మరసంలో కొంచెం సేపు తడిపి వ్యాధి సోకిన గోళ్లకు చుట్టాలి. ఈ విధంగా చేస్తుంటే గోళ్ల సమస్యలు రాకుండా ఉంటాయి. దీంతో పాటు గోళ్లపై ఉండే సహజమైన రంగు పోకుండా కూడా కాపాడుతుంది.
పల్చటి తెల్ల గుడ్డను ఉల్లిపాయ రసంలో బాగా తడిపి వ్యాధి ఉండే గోళ్లకు చుట్టాలి. దీని వల్ల మంచి ఫలితం కనపడుతుంది.
కూరల్లో వాడుకునే దోసకాయ ముక్కల్ని తరచుగా తింటూ ఉంటే పిప్పి గోళ్లు, గోళ్ల పగుళ్లు, మచ్చలు త్వరగా తగ్గుముఖం పట్టే అవకాశం ఉంది.