Latest News

Powered by Blogger.
Monday, 7 December 2015

మష్రూమ్‌ పనీర్‌ మసాలా

కావలసిన పదార్దాలు

మష్రూమ్స్‌ : 100 గ్రా.
పనీర్‌ : 100 గ్రా.
ఉల్లిపాయలు: 1 (సన్నగా తరిగి)
పసుపు : 1/2 టీ స్పూన్‌
పచ్చి మిర్చి : 4 (తరిగి)
అల్లం, వెల్లుల్లి పేస్ట్‌ : 1 టీ స్పూన్లు
ధనియాల పొడి : 1 టీస్పూన్‌
కొబ్బరి పొడి : 2 టీస్పూన్లు
గరం మసాలా పొడి : 1/2 టీ స్పూన్‌
ఉప్పు : తగినంత
జీలకర్ర : 1 టీస్పూన్‌
ఆవాలు : పోపుకు తగినన్ని
నూనె : 4 స్పూన్లు
కొత్తిమీర : అలంకరణకి

తయారు చేసే విధానం...
మష్రూమ్స్‌ను తీసుకొని శుభ్రంగా కడిగి, ఉడికించి వాటిని చిన్న చిన్న ముక్కలుగా చేసుకోవాలి. పనీర్‌ను తురుముకోవాలి. బాణలిని పొయ్యి మీద నూనె పోసి వేడెక్కాక అందులో జీలకర్ర, ఆవాలు, సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలను వేసి గోల్డ్ కలర్ వచ్చే వరకూ వేగించాలి. అందులో పచ్చి మిర్చి, మష్రూమ్స్‌, అల్లం వెల్లుల్లి పేస్ట్‌, పసుపు వేసి రెండు నిమిషాలు వేగించాలి.ఆ తర్వాత తురిమి పెట్టుకున్న పనీర్‌ వేసి బాగా కలిసేలా కలపాలి. పనీర్‌ కరిగిన తర్వాత అది తక్కుపోతుంది కనుక బాగా కలుపుతూ ఉండాలి. ఆ తర్వాత దానిలో ధనియాల పొడి, ఉప్పు, కొబ్బరి పొడి, గరం మసాలా పొడి వేసి బాగా కలపాలి. ఇవన్నీ బాగా కలిసాక కొత్తిమీరతో గార్నిష్ చేసి సాస్‌ వేసి సర్వ్‌ చేయాలి.

  • Blogger Comments
  • Facebook Comments
Top