క్షణం తీరిక లేని జీవన శైలిలో ఆలస్యంగా లేచినప్పుడు పరగడుపున కొన్ని ఆహారాలను తీసుకోవటం మంచిది కాదు. పరగడుపున సోడా,శీతల పానీయాలను త్రాగటం వలన జీర్ణశయంలో హాని చేసే కొన్ని ఆమ్లాలు విడుదల అవుతాయి. ఈ ఆమ్లాల కారణంగా వికారం, వాంతుల వంటి అనారోగ్య సమస్యలు తలెత్తుతాయి. వీటిని త్రాగటం కంటే మంచినీళ్ళు త్రాగటం మంచిది.
ఘాటైన మసాలాలు, గ్రేవీ కూరలను అసలు పరగడుపున తీసుకోకూడదు. ఎందుకంటే పొట్టలో తిప్పుతుంది. అలాగే రోజంతా నిరుత్సాహంగా ఉంటుంది. ఇదే పరిస్థితి ఎక్కువ కాలం కొనసాగితే అల్సర్ వచ్చే ప్రమాదం ఉంది. అందుకే ఉదయం తేలిగ్గా జీర్ణం అయ్యే ఆహారాన్ని తీసుకోవటం మంచిది.
చాలా మంది ఉదయం నిద్ర లేవగానే కాఫీ,టీ లను త్రాగుతూ ఉంటారు. ఉదయం వాటిని త్రాగటం మంచిదే అయిన పరగడుపున త్రాగటం మంచిది కాదు. ఈ విధంగా త్రాగటం వలన హార్మోన్స్ అసమానతలు ఏర్పడతాయి. అందువల్ల మొదట ఒక గ్లాస్ మంచినీటిని త్రాగి పది నిముషాలు అయిన తర్వాత కాఫీ,టీ లను త్రాగటం మంచిది.
పుల్లని పదార్దాల వలన ఉదయం పూట జీర్ణ వ్యవస్థకు ఇబ్బంది కలుగుతుంది. ముఖ్యంగా టమోటాలను పరగడుపున తీసుకోకూడదు. చాలా మంది టమోటా బాత్,టమోటా రైస్ వంటివి చేస్తూ ఉంటారు. అయితే వీటిని తినేముందు ఒక గ్లాస్ పాలు కానీ ఏదైనా వేరే పదార్దం కానీ తినాలి.
పరగడుపున అరటిపండు జోలికి అసలు వెళ్ళకూడదు. అరటిపండులో మెగ్నీషియం ఉంటుంది. అది ఉదయం పూట శరీరానికి ఎక్కువ మోతాదులో అందటం మంచిది కాదని నిపుణులు అంటున్నారు.