Latest News

Powered by Blogger.
Saturday, 12 December 2015

గోధుమ హల్వా

How to prepare Godhuma Halwa In telugu

కావలసిన పదార్దాలు

గోధుమ పిండి: 1 కప్పు
నెయ్యి: 1/2 కప్పు
జీడిపప్పు:1/4కప్పు
కిస్మిస్‌: 1/4 కప్పు
నీరు: 3 కప్పులు
పంచదార: 1 కప్పు
యాలకులు : 1/2 చెంచా పొడిచేసింది.

తయారు చేసే విధానం:

అడుగు మందంగా ఉన్న బాణలిని తక్కువ మంటపై పెట్టి నెయ్యిని కరిగించాలి. అందులో జీడిపప్పు, కిస్ మిస్ లు వేసి గోల్డ్ కలర్ వచ్చేవరకు వేగించాలి. ఆ తర్వాత వాటిని ప్లేట్ లో తీసి పక్కన పెట్టుకోవాలి. గోధుమ పిండిని నేతిలో వేసి పది నిమిషాల పాటు గోల్డ్ కలర్ వచ్చే వరకు వేగించాలి . పక్కనే మరో పొయ్యి మీద మందపాటి అడుగున్న గిన్నెలో నీళ్ళు పోసి చక్కెర వేసి అది కరిగి పాకం అయ్యేవరకు తిప్పాలి. యాలకుల పొడిని పాకంలో వేసి ఆ తర్వాత నెమ్మదిగా వేగించి పెట్టుకున్న పిండిని వేసి పిండి ఉండలు కట్టకుండా తిప్పుతూ ఉండాలి. బాణలి పక్కల నుంచి హల్వా ఊడి వచ్చే వరకూ ఉడికించాలి. ఆ తర్వాత ఒక ప్లేట్‌ తీసుకుని దానికి నెయ్యి రాసి అందులో ఈ హల్వాను పరచాలి. దానిపై వేగించి పెట్టుకున్న జీడిపప్పు, కిస్మిస్‌లను అద్దాలి. ముక్కలుగా కట్‌ చేసి సర్వ్‌ చేయాలి. ఈ హల్వాను వేడిగా తిన్నా బాగుంటుంది. చల్లారిన తర్వాత తిన్నా బాగుంటుంది.

  • Blogger Comments
  • Facebook Comments
Top