Latest News

Powered by Blogger.
Wednesday, 16 December 2015

బేకింగ్‌ చేసే పద్దతిని తెలుసుకుందాం

కొందరు ఉప్మా చేసినంత ఈజీగా కేక్‌లు బేక్‌ చేసేస్తూ ఉంటారు. ఇక్కడ అసలు కిటుకంతా బేకింగ్‌ పద్ధతి, రెసిపీల తయారీల్లోనే ఉంది. ఈ సులభమైన ట్రిక్స్‌ ని మీరు అప్లై చేస్తే మీరు కూడా చిటికెలో బేకింగ్‌ మాస్టర్‌ అయిపోవచ్చు.

చల్లని గుడ్లు వాడకూడదు
సాధారణంగా గుడ్లు ఫ్రిజ్‌లో ఉంచుతాం. ఇవే గుడ్లను నేరుగా బేకింగ్‌ కోసం వాడకూడదు. వెన్నను కూడా రూమ్‌ టెంపరేచర్‌కు వచ్చాక మాత్రమే ఉపయోగించాలి. గుడ్లు కూడా గది ఉష్ణోగ్రత వద్దకు వచ్చాకా మాత్రమే ఉపయోగించాలి. లేదంటే మిశ్రమం సరిగా కలవదు. అందువలన గోరువెచ్చని నీటిలో గుడ్లను 10 - 15 నిమిషాలు పాటు ఉంచిన తర్వాతే మాత్రమే ఉపయోగించాలి.

పిండి కచ్చితంగా కొలవాలి

కేక్‌ తయారీ పిండిని కొలవటానికి పొడి కొలత కప్పును తప్పనిసరిగా ఉపయోగించాలి. కప్పు అంచుల వరకే కొలిచి పైనున్న పిండిని తీసేయాలి. పిండిని కొలిచేటప్పుడు స్పూన్‌తో డబ్బాలోని పిండిని తీసి మెజరింగ్‌ కప్‌లో వేయాలి. ఇలాకాకుండా నేరుగా డబ్బాలో కప్పుని ముంచి పిండి తోడితే అవసరానికి మించిన పిండి కప్పులో కూరుకుపోతుంది. దాంతో కొలత తప్పి కేక్‌ రెసిపీ పాడయ్యే అవకాశాలు ఉన్నాయి.

బటర్‌ బ్రషింగ్‌
కేక్‌ పాన్‌లో అడుగున బటర్‌ పేపర్‌ వేసినా వేయకపోయినా బ్రష్‌తో బటర్‌ పూయటం మాత్రం మర్చిపోవద్దు. మెత్తని వెన్నలో బ్రష్‌ ని ముంచి టిన్‌ లోపల, అంచుల్లో పూసిన తర్వాత పిండితో నింపాలి. ఆ తర్వాత పొడి పిండి వేసి పాన్‌ అంతా పరుచుకునేలా తిప్పాలి. ఈ విధంగా చేస్తే కేక్‌ టిన్‌కు అంటుకోకుండా నీట్‌గా ఊడి వస్తుంది.

పాన్‌లను తిప్పాలి
సమంగా బేక్‌ అవ్వాలంటే పాన్‌లను తరచుగా తిప్పుతూ ఉండాలి. అయితే ఇందుకోసం పాన్‌లో కేక్‌ సెట్‌ అయ్యేవరకూ ఆగాలి. అంటే మొత్తం బేకింగ్‌ టైమ్‌లో పావు సమయం గడిచిన తర్వాత మాత్రమే పాన్‌లను ప్రతి పావు వంతు సమయానికీ తిప్పుతూ ఉండాలి. ఈ విధంగా చేస్తే కేక్‌ కొలాప్స్‌ అవకుండా చక్కగా ఉబ్బుతుంది. ఒకవేళ ఎక్కువ ర్యాక్‌లు ఉపయోగిస్తున్నట్లైతే కేక్‌ టిన్‌లను పైకి కిందకి మారుస్తూ ఉండాలి.

  • Title : బేకింగ్‌ చేసే పద్దతిని తెలుసుకుందాం
  • Posted by :
  • Date : 10:17 am
  • Labels :
  • Blogger Comments
  • Facebook Comments
Top