గుడ్డు -1 (రెండు పరాటాలకు)
గోధుమపిండి - 1 కప్పు
టమోటా - 1
ఉల్లిపాయ -1
పచ్చిమిర్చి - 1
కొత్తిమీర - 1 కట్ట,
కారం - అర టీ స్పూను
ఉప్పు - రుచికి సరిపడా
చాట్ మసాలా - అర టీ స్పూను
ధనియాలపొడి - అర టీ స్పూను
జీరాపొడి - అర టీ స్పూను
నూనె - పరాటాలు కాల్చడానికి సరిపడా.
తయారుచేసే విధానం:
గోధుమ పిండిలో కొంచెం ఉప్పు వేసి సరిపడా నీటిని పోసి ముద్దలా చేసుకుని ఒక అరగంట సేపు నానబెట్టాలి. ఉల్లిపాయ, పచ్చిమిర్చి, టమోటోలను సన్నగా తరగి పక్కన పెట్టుకోవాలి. ఒక గిన్నెలో గుడ్డు సోన వేసి బీట్ చేసి దానిలో ఉల్లిపాయ ముక్కలు,పచ్చిమిర్చి ముక్కలు,టమోటా ముక్కలు,దనియాల పొడి,జీరా పొడి,చాట్ మసాలా,ఉప్పు వేసి బాగా కలపాలి. పైన కలిపి పెట్టుకున్న పిండిని చిన్న చిన్న ముద్దలుగా చేసుకోవాలి. ఒక ముద్దను తీసుకోని పొడిపిండి కొద్దిగా చల్లుతూ త్రికోణంలా మడతపెట్టి చపాతీ వలే చేయాలి. దీనిని పెనంపై వేసి సన్నని మంట మీద కాలిస్తే ఒక వైపు పొంగుతుంది. పొంగిన వైపు కత్తితో కట్ చేసి పైన తయారుచేసుకున్న గుడ్డు మిశ్రమాన్ని పలచగా రుద్ది అంచులను వత్తాలి. ఆ తర్వాత గుడ్డు వాసన పోయే వరకు రెండు వైపులా నూనె వేసి కాల్చాలి. వేడి వేడి ఈ పరాటాలకు రైతా మంచి కాంబినేషన్.