Latest News

Powered by Blogger.
Tuesday, 10 November 2015

శీతాకాలంలో చేతులు పొడిబారకుండా ఉండాలంటే...ఇంటి చిట్కాలు

కొంత మంది అదే పనిగా లిక్విడ్‌ వాష్‌లతో చేతుల్ని కడుగుతుంటారు. ఆ విధంగా చేయుట వలన అర చేతులు పొడిగా మారి నొప్పిగా అనిపిస్తాయి. అందువలన ఎక్కువగా శుభ్రం చేసుకోకుండా అవసరం అయినప్పుడు మాత్రమే చేతులను శుభ్రం చేసుకోవాలి.

రోజులో వీలైనన్ని సార్లు అర చేతులకు మాయిశ్చరైజర్‌ రాస్తూ ఉండాలి. ఈ విధంగా చేస్తే చేతులు మృదువుగా మారతాయి.

కొద్దిగా నిమ్మరసం,కొబ్బరి నూనె కలిపి చేతులకు రాసుకొని సున్నితంగా మర్దన చేసుకుంటే అర చేతులు మృదువుగా మారతాయి.

ఒక స్పూన్ గ్లిజరిన్‌, కొంచెం రోజ్‌వాటర్‌, రెండు స్పూన్ల ఆలివ్‌నూనె, కాస్త నిమ్మరసం, గుడ్డులోని తెల్లసొన కలిపి చేతులకు ప్యాక్ వేసుకొని ఆరాక కడిగితే చేతులు మృదుత్వాన్ని సంతరించుకుంటాయి.

ఉడికించిన బంగాళదుంప గుజ్జుకు కాసిని పాలు కలిపి చేతులకు ప్యాక్‌లా వేసుకోవచ్చు. ఇది చర్మాన్ని కోమలంగా మారుస్తుంది.

టమాటాలు.. గింజల్లేని ఖర్జూరాలు రెండు చొప్పున తీసుకుని.. మిక్సీలో మెత్తని పేస్ట్ గా చేసుకోవాలి. ఈ పేస్ట్ ను చేతులకు ప్యాక్‌లా వేసుకోవాలి. ఆరాక గోరువెచ్చని నీటిలో ముంచిన వస్త్రంతో తుడిచేస్తే.. చేతుల్లో పేరుకున్న మృతచర్మం తొలగిపోయి ప్రకాశవంతంగా మారతాయి.

  • Title : శీతాకాలంలో చేతులు పొడిబారకుండా ఉండాలంటే...ఇంటి చిట్కాలు
  • Posted by :
  • Date : 12:29 pm
  • Labels :
  • Blogger Comments
  • Facebook Comments
Top