పప్పు ధాన్యాలలో ప్రొటీన్స్ సమృద్దిగా ఉంటాయి. ఇవి వ్యాధి నిరోధక శక్తిని పెంచడంతో పాటు కండారాల పటుత్వాన్ని కూడా నిలబెడతాయి. మాంసం, చేపల వంటి వాటిలో ప్రొటీన్లు ఎక్కువగా ఉన్నా, కొలెస్ట్రాల్, గడ్డ కట్టే కొవ్వు పదార్థాలు కూడా ఎక్కువగానే ఉంటాయి. అదే మొక్కల నుంచి వచ్చే ప్రొటీన్లలో అయితే, కొలెస్ట్రాల్, గడ్డ కట్టే కొవ్వు పదార్థాలు చాలా తక్కువగా ఉంటాయి. వీటిలో శరీర పోషణకు అవసరమైన క్యాల్షియం, పొటాషియం,ఫైబర్ సమృద్ధిగా ఉండడం వలన ఈ పప్పుధాన్యాలు గుండె జబ్బులు రాకుండా కాపాడతాయి. అంతే కాకుండా ఎముకలను గుళ్ళ చేసే ఆస్టియోపొరోసిస్, అధిక రక్తపోటు, స్థూలకాయం, మధుమేహ వ్యాధుల నుంచి దూరంగా ఉంచుతాయి. ఏది ఏమైనా శాకాహారులకు, గ్లూటన్- ఫ్రీ ఆహారానికి, ఆరోగ్యవంతమైన గుండెను కోరుకునే వారికి ఇవి గొప్ప ఆధారాలు. పెసర్లు, బొబ్బెర్లు, రాజ్‌మా,శనగలు, బఠానీ, పల్లీలు, చిక్కుడు గింజలు, వీటితో పాటు బాదాం, పిస్తా, జీడిపప్పు ఇవన్నీ శరీర అవసరాలకు సరిపోయే పోషకాలన్నిటికీ వరం లాంటివి. వీటిని ఉడికించి తినడం వల్ల ఎంతో ప్రయోజనం కలుగుతుంది. ఒక కప్పు పప్పు ధాన్యాల్లో 18 దాదాపు గ్రాముల ప్రొటీన్ దాకా లభిస్తుంది.
బరువు తగ్గడానికి
పప్పు ధాన్యాల్లో ఎక్కువగా పీచు పదార్థం ఉండడం వలన ఒక కప్పు ధాన్యం తినడంతోనే క డుపు నిండిన భావన కలుగుతుంది. ఈ విధంగా ఎక్కువగా తినలేకపోవడం వలన బరువు తగ్గడానికి అవకాశం ఉంది. ఈ ధాన్యాల్లో గ్లైసిమిక్ ఇండెక్స్ తక్కువగా ఉండుట వలన ఆకలి కూడా తొందరగా వేయదు. అంతేకాక వీటిని తరుచూ తినడం వల్ల చెడు కొలెస్ట్రాల్ (ఎల్‌డిఎల్) 5 శాతం దాకా తగ్గిపోయి గుండె సంబంధిత వ్యాధులు దరిచేరవు. చాలా మంది వృద్ధుల్లో జింక్, ఐరన్, మాంగనీస్, పొటాషియం, మెగ్నీషియం, కాపర్, సెలీనియం లోపాలు ఉంటాయి. వీటన్నింటినీ పప్పు ధాన్యాలు పూరిస్తాయి. మాంసంతో పోలిస్తే, వీటికి సులభంగా జీర్ణమయ్యే లక్షణం ఉండడం వల్ల అన్ని వయసులవారికీ ఎంతో ఉపయోగకరంగా ఉంటాయి.