కారణం ఏది అయినా శరీరంలోని మెడ , వీపు వంటి భాగాలను శుభ్రం చేయడంలో చాలా నిర్లక్ష్యం చేస్తూ ఉంటాం. దాని వలన ఎక్కువ సమస్యలు రాకపోయినా సహజమైన మృదుత్వం, సౌందర్యాన్నీ కోల్పోతాం. దీనిని దీర్ఘ కాలంగా నిర్లక్ష్యం చేయటం వల్ల ఆయా భాగాల్లో చర్మ సంబందిత వ్యాధులు కూడా రావచ్చు. ఒక్కోసారి మొటిమలు, పులిపిర్ల వంటి సమస్యలు ఏర్పడవచ్చు. ఈ సమస్యకు పరిష్కారాలను తెలుసుకుందాం.
కొన్ని జాగ్రత్తలు :
రోజుకు కనీసం మెడ భాగాన్ని రెండు సార్లు అయినా శుభ్రం చేయాలి.
తరచూ మసాజ్ చేయడం ద్వారా మెడ భాగంలోని చర్మం మృదువుగా మారటమే కాకా కాంతివంతంగా మారుతుంది.
ఉదయం వేళ సన్ స్ర్కీన్ లోషన్ రాయటం మరియు రాత్రి సమయంలో ఏదైనా క్రీమ్‌తో మసాజ్ చేయడం ద్వారా మెడ భాగంలో రక్తప్రసరణ పెరగడంతోపాటు అక్కడ ఉన్న మరకలు, ముడతలు నిదానంగా మాయం అవుతాయి.
ప్రతి రోజు నూనెతో మర్దన చేయడం ద్వారా వయసు పైబడిన లక్షణాలు ఏమి కనిపించవు.
అంతేకాక అక్కడ ఉన్న వెంట్రుకలను ఎప్పుడూ రివర్స్‌గా షేవ్ చేయకూడదు.
ఇంటి వైద్యం
రెండు టీ స్పూన్ల బియ్యం పిండిలో అర స్పూను పసుపు కలపాలి. ఆ త ర్వాత పాల క్రీము వేసి పేస్ట్‌గా తయారు చేసి నలుపుగా ఉన్న మెడ భాగంలో రాయాలి. పది నిమిషాల తర్వాత గోరు వెచ్చని నీటితో కడిగేయాలి.
ఓట్ మీల్, పెరుగు, బాదం, తాజా టొమాటో రసం వీటిని సమాన బాగాల్లో తీసుకోని బాగా కలపాలి. ఈ మిశ్రమాన్ని ఆయా భాగాల్లో అప్లై చేస్తే చర్మంలో నునుపు, కాంతి పెరుగుతుంది.
వీపు భాగంలో
వీపు భాగంలో మచ్చలు ఏర్పడినప్పుడు, వెల్లుల్లితో చేసిన ఫేస్ట్‌ను రాస్తే ఆ మచ్చలన్నీ తొలగిపోతాయి. చాలా సహజ సిద్ధమైన బ్లీచింగ్ పదార్థాలుగా టొమాటో, తాజా నిమ్మరసంలను చెప్పవచ్చు. మచ్చలు ఏర్పడిన చోట 20 నిమిషాల పాటు ఈ క్రీముతో మసాజ్ చేస్తే అవన్నీ తొలగిపోతాయి.
రోజ్ వాటర్ తో చేసిన పేస్ట్ ని వీపు భాగంలో మసాజ్ చేసినా ఆ భాగమంతా కాంతివంతంగా మారుతుంది.