నుదురుతో పాటు రెండు కనుబొమలను మెల్లగా పైకెత్తి ఆశ్చర్యపోయినట్టు భంగిమను పెట్టాలి. ఈ భంగిమ వల్ల నుదురుకు సంబంధించిన కండరాలు పటిష్టమవుతాయి. అలాగే ముఖంపై ముడతలు కూడా ఏర్పడవు. ఈ వర్కవుట్‌ని ప్రతి రోజుకు మూడు నుంచి నాలుగు సార్లు చేస్తే మంచి ఫలితం కనపడుతుంది.
కనుబొమలను చిట్లించినట్టు పెట్టాలి. అనంతరం నుదురును రిలాక్సింగ్‌గా ఉంచాలి. ఈ విధంగా రోజుకు మూడు నాలుగుసార్లు చేస్తే మంచిది.
కనురెప్పలను రిథమిక్‌గా నాలుగు సెకన్లపాటు మూసి తెరుస్తూ ఉండాలి. ఈ విధంగా చేయుట వలన కళ్లు పొడిగా మారవు. అంతేకాదు కళ్ల చుట్టూ ఉన్న సున్నితమైన కండరాలకు కూడా మంచి వ్యాయామం అవుతుంది. ఈ మూడు వ్యాయామాలను వరుస క్రమంలోనే చేస్తే మంచి పలితాన్ని పొందవచ్చు.
నోటిని నములుతున్నట్టు తిప్పుతుండాలి. ఈ విధంగా చేయడం వల్ల ఫ్లాసిడ్ చీక్ మజిల్స్‌కు వ్యాయామం బాగా జరిగి చంపలకు మంచి షేప్ ని ఇస్తుంది.
బుగ్గలను బెలూన్‌లా పెట్టి ఈల వేస్తున్న భంగిమలో పెదాలను పెట్టాలి. ఈ వ్యాయామం చేయడం వల్ల ముఖం మీద లాఫ్ లైన్స్ ఏర్పడవు. పెదాల కండరాలను కూడా పటిష్టం చేస్తాయి. ఈ విధంగా ప్రతి రోజు నాలుగు నుంచి ఐదు సార్లు కొన్ని సెకన్లపాటు చేస్తే మంచిది.
మెడను రెండుపక్కలకు తిప్పుతూ, పైకి లేపుతూ వర్కవుట్ చేయడం వల్ల మెడ, గడ్డం దగ్గరున్న కండరాలు రిలాక్స్ అవుతాయి. ఈ విధంగా ప్రతి రోజు మూడు లేదా నాలుగుసార్లు కొన్ని సెకన్లపాటు చేయాలి.
దూరంగా ఉన్న వస్తువును కళ్లార్పకుండా షాక్ గురయిన భంగిమలో చూడాలి. ఈ విధంగా చూడడం వల్ల కళ్లకు రక్తప్రసరణ బాగా జరుగుతుంది. అంతేకాదు కళ్లు వాయడం, కళ్లకింద సంచులు ఏర్పడడం తగ్గుతాయి. కళ్లకింద ఏర్పడ్డ నల్లటి వలయాలు కూడా పోతాయి. రోజుకు మూడు నాలుగుసార్లు ఐదు సెకన్లపాటు ఈ వర్కవుట్ చేస్తే మంచిది.
నోటిని గోల్డెన్‌ఫిష్ ఆకారంలో పెట్టాలి. ఈ వర్కవుట్ గడ్డంపై, చంపలపై బాగా పనిచేస్తుంది. దీన్ని కనీసం రోజుకు మూడునాలుగుసార్లు చేయాలి.
నోరుని ఫ్లైయింగ్ కిస్ ఇస్తున్న భంగిమలో పెట్టాలి. ఇది ఎంతో శక్తివంతమైన ఫేషియల్ వర్కవుట్. నోటి చుట్టూ ఉన్న కండరాలను బలోపేతం చేయటంలో సహాయపడుతుంది. అంతేకాదు చర్మం సాగిపోయే తత్వాన్ని నియంత్రిస్తుంది. ఈ వర్కవుట్‌ను రోజుకు నాలుగైదుసార్లు తప్పనిసరిగా చేయాలి.