మెదడులో రక్త స్రావము
మెదడులోని రక్తనాళాలలో కొన్నిచోట్ల బొడిపెల మాదిరిగా ఏర్పడినపుడు ఆ ప్రదేశంలో రక్తం నిలిచిపోతుంది. ఫలితంగా అక్కడ రక్తనాళం ఉబ్బిపోతుంది. ఇలా ఉబ్బిన రక్తనాళాలు చుట్టుపక్కల ఉన్న కణజాలంపై, ఇతర నరాలపై ఒత్తిడిని కలగజేస్తాయి. దీనినే సెరిబ్రల్ ఎన్యూరిజం అంటారు. ఇలా ఉబ్బిన రక్తనాళాలు ఒక్కోసారి పగిలి మెదడులో రక్తస్రావం అవుతుంది. దీనిని హేమరేజ్ అంటారు. ఇది మెదడులో ఎక్కడైనా ఏర్పడవచ్చు.
కారణాలు
పుట్టుకతో రక్తనాళాల్లో లోపం, కొన్ని రకాల జన్యుసంబంధ వ్యాధులతో బాధపడే వారిలో ఏర్పడే అవకాశం ఉంది. తలకు గాయం, రక్తపోటు, ఇన్ఫెక్షన్లు, ట్యూమర్లు, అథెరోస్కెలెరొసిస్ వంటి వ్యాధులతో బాధపడే వారిలోనూ సెరెబ్రల్ ఎన్యూరిజం వచ్చే అవకాశం ఉంది. సిగరెట్ స్మోకింగ్, అతిగా మందులు వేసుకోవడం, కొన్ని రకాల గర్భనిరోధక మాత్రల వల్ల ఎన్యూరిజమ్(బొడిపెలు) డెవలప్ అయ్యే అవకాశాలున్నాయి.
ఎన్ని రకాలు
సెరిబ్రల్ ఎన్యూరిజం మూడు రకాలుగా ఉంటుంది. సక్యులర్ ఎన్యూరిజం, బెర్రీ ఎన్యూరిజం, లాటరల్ ఎన్యూరిజం. ఎన్యూరిజంలను సైజు ఆధారంగా కూడా వర్గీకరించవచ్చు. చిన్న ఎన్యూరిజమ్స్ 11 మి.మీ వ్యాసం కంటే చిన్నగా ఉంటాయి. పెద్ద ఎన్యూరిజమ్స్ 11 నుంచి 25 మి.మీ వ్యాసంతోనూ, గేయింట్ ఎన్యూరిజమ్స్ 25 మి.మీ కంటే ఎక్కువ వ్యాసం కలిగి ఉంటాయి.
ఎవరికి రావచ్చు?
బ్రెయిన్ ఎన్యూరిజం ఎవరికైనా రావచ్చు. ఏ వయసులోనైనా రావచ్చు. పిల్లలతో పోలిస్తే పెద్దవాళ్లలో ఎక్కువ. పురుషులతో పోలిస్తే స్త్రీలకు వచ్చే అవకాశాలు ఎక్కువ. కొన్ని ప్రత్యేక సంక్రమిత జబ్బులతో బాధపడే వారు ఎన్యూరిజం బారిన పడే అవకాశాలు చాలా ఎక్కువ.
అపాయమెంత?
ఎన్యూరిజమ్స్ పగిలిపోయి మెదడులో రక్తస్రావం అయ్యే అవకాశం ఉంది. దీనివల్ల తీవ్రమైన సమస్యలు ఉత్పన్నమవుతాయి. స్ట్రోక్, రక్తనాళాలు శాశ్వతంగా దెబ్బతినడం, మనిషి చనిపోవడం జరుగుతుంది. ఒకసారి బొడిపె పగిలి రక్తస్రావం అయితే తిరిగి మళ్లీ ఇంకోసారి పగిలి మెదడులో రక్తస్రావం అయ్యే అవకాశం ఎక్కువ. దీనివల్ల మరిన్ని ఎన్యూరిజమ్స్ ఏర్పడే అవకాశం ఉంది. సాధారణంగా బొడిపెలు పగలడం వల్ల సబ్అర్చనాయిడ్ హేమరేజ్ ఏర్పడుతుంది. ఎన్యూరిజం పగలడం వల్ల కపాలం, మెదడుకు మధ్య రక్తస్రావం అవుతుంది. నిర్లక్ష్యం చేస్తే హైడ్రోసెఫలస్ సమస్య తలెత్తుంది. ఎన్యూరిజమ్స్ పగలడం వల్ల మెదడుకు జరిగే రక్తసరఫరా తగ్గిపోతుంది. దీనిద్వారా స్ట్రోక్ వచ్చే అవకాశం ఉంది.
లక్షణాలు
రక్తనాళాలు చాలా ఉబ్బిపోయే వరకు లేక పగిలిపోయే వరకు ఎలాంటి లక్షణాలు కనిపించవు. చిన్నగా ఉండే ఎన్యూరిజమ్స్తో ఎలాంటి లక్షణాలు ఉత్పన్నం కావు. బొడిపె చాలా పెరిగి కణజాలం, నరాలపై ఒత్తిడి పడినపుడు నొప్పి వస్తుంది. కంటిపైన, కింద నొప్పి ఏర్పడుతుంది. కళ్లు మసకగా కనిపించడం, ముఖానికి ఒకవైపు పక్షవాతం రావడం, తిమ్మిర్లు రావడం వంటి లక్షణాలు కనిపిస్తాయి. బొడిపె పగిలిపోయి రక్తస్రావం అయినపుడు తీవ్రమైన తలనొప్పి, వస్తువులు రెండుగా కనిపించడం, వికారం, వాంతులు, మెడ పట్టేసినట్టుగా ఉండటం వంటి లక్షణాలు ఉంటాయి. తీవ్రమైన తలనొప్పి వస్తుంది.
నిర్ధారణ
యాంజియోగ్రఫీ, సి.టి యాంజియోగ్రఫీ, ఎమ్ఆర్ఐ స్కాన్ పరీక్షల ద్వారా సెరెబ్రల్ ఎన్యూరిజంను గుర్తించవచ్చు. ఇంట్రాసెరెబ్రల్ యాంజియోగ్రామ్ ద్వారా మెదడుకు వెళుతున్న రక్తనాళాల్లో ఏవైనా అడ్డంకులు ఏర్పడ్డాయో గుర్తించవచ్చు. ఈ పరీక్ష ద్వారా ట్యూమర్, ఎన్యూరిజం సైజు, ఏర్పడిన ప్రదేశం, దాని ఆకృతిని తెలుసుకోవచ్చు. ఎమ్ఆర్ఐ స్కాన్ ద్వారా మెదడులోని రక్తనాళాలను పరిశీలించవచ్చు. రక్తనాళాల ఫోటోలను తీసుకోవచ్చు. మెదడులో రక్తస్రావాన్ని గుర్తించవచ్చు.
నివారణ
రక్తపోటును నియంత్రణలో ఉంచుకోవడం, స్మోకింగ్ మానేయడం, కొకైన్ వంటి మాదకద్రవ్యాలకు దూరంగా ఉండాలి. ఆస్పిరిన్ వంటి మాత్రలను వాడటం వల్ల కలిగే లాభాలు, దుష్ఫలితాలను డాక్టర్ను అడిగి తెలుసుకుని వాడటం మంచిది. గర్భనిరోధకమాత్రలు డాక్టర్ సలహామేరకు వాడటం మంచిది.