Latest News

Powered by Blogger.
Friday, 30 October 2015

మార్కెట్‌ నుంచి తెచ్చిన పళ్లను ఏ విధంగా శుభ్రం చేయాలో తెలుసుకుందాం

మార్కెట్‌ నుంచి తెచ్చిన పళ్లను ఏ విధంగా శుభ్రం చేయాలో తెలుసుకుందాం...... 

పండ్లు, కూరగాయలు ద్వారా ప్రొటీన్లు, విటమిన్లు, మినరల్స్‌ వంటి అనేక పోషక పదార్థాలు మన శరీరానికి అందుతాయి. అయితే మార్కెట్‌ నుంచి తెచ్చిన పళ్లను శుభ్రం చేయకుండా తింటే మాత్రం అంతే సంగతులు. తినేముందు ఈ కూరగాయలు, పండ్లను ఏ విధంగా శుభ్రం చేయాలో తెలుసుకుందాం. 

-ఆపిల్‌, ద్రాక్ష, చెర్రీ లాంటి పండ్లతో పాటు, టమాట, బంగాళాదుంప వంటి కూరగాయల్ని సింక్‌ నుంచి ఫాస్ట్‌గా వచ్చే నీటితో శుభ్రం చేయటం మంచిది. 

-ఒక పెద్ద బౌల్‌లో నీటిని తీసుకోని దానిలో కొంచెం ఉప్పు వేసి కలిపి అప్పుడు దానిలో కూరగాయల్ని, పండ్లను పది నిమిషాల పాటు ఉంచాలి. ఈ విధంగా చేయుట వలన వాటిపై ఉండే హానికర రసాయనాలు తొలిగిపోతాయి. ఆ తర్వాత మంచి నీళ్లతో మరల ఒకసారి వాటిని శుభ్రం చేయాలి. 

-ఒక వెడల్పాటి గిన్నెలోనీటిని తీసుకుని అందులో కొంచెం వెనిగర్‌ వేయాలి. ఆ గిన్నెలో కూరగాయలు, పండ్లు వేసి పదిహేను నిమిషాల పాటు ఉంచితే పండ్లపై ఉండే రసాయనాలు, మైనం పోతుంది. అలాగే కూరగాయలపై ఉండే చెడు బ్యాక్టీరియా వదిలిపోతుంది. 

-మంచి నీరు, నిమ్మరసం, వెనిగర్‌ కలిపిన మిశ్రమాన్ని ఒక స్ర్పే బాటిల్‌లో తీసుకుని పండ్లు, కూరగాయలపై స్ర్పే చూయాలి. ఆ తర్వాత మంచి నీళ్లతో శుభ్రం చేసి మెత్తటి వస్త్రంతో తుడవాలి.

      • Blogger Comments
      • Facebook Comments
      Top