వెన్నునొప్పి అత్యంత సాధారణమైన సమస్య . దీనిని సమర్ధవంతంగా నయం చేయటానికి కొన్ని హోం రెమడీస్ ఉన్నాయి.
1. కొబ్బరి నూనెలో కర్పూరం వేసి 5 నిముషాలు మరిగించాలి. అది చల్లారిన తర్వాత ఒక సీసాలో భద్రపరచాలి. వెన్ను నొప్పి తగ్గటానికి వారంలో రెండు సార్లు పడుకొనే ముందు ఈ నూనెతో మసాజ్ చేయాలి.
2. గోరువెచ్చని నీటిలో కొన్ని చుక్కల యూకలిప్టస్ నూనె వేసి ఆ నీటితో స్నానం చేస్తే ఒంటి నొప్పులు మరియు వెన్నునొప్పి తగ్గటానికి సహాయపడుతుంది. అలాగే మీకు ఒత్తిడి లేని అనుభూతిని కలిగిస్తుంది.
3. మీరు TV చూస్తున్న సమయంలో మీ వెనక భాగంలో మద్దతు కోసం కుషన్ మరియు ఒక వేడి నీటి బ్యాగ్ ను ఉంచండి. వేడి ఆధారిత చికిత్స మీ వెన్నునొప్పిని తగ్గించటంలో సహాయం చేస్తుంది.
4. స్నానం చేయటానికి ముందు ఆవాల నూనెతో మర్దన చేసుకోవాలి. ఆ తర్వాత గోరువెచ్చని నీటితో స్నానం చేయాలి.
5. ఒక గ్లాస్ గోరువెచ్చని పాలలో చిటికెడు పసుపు,కొన్ని చుక్కల తేనే కలిపి ప్రతి రోజు క్రమం తప్పకుండా త్రాగాలి. ఈ విధంగా చేస్తే వెన్ను నొప్పి తగ్గటమే కాకుండా ఒంటి నొప్పులు,దగ్గు మరియు జలుబు కూడా తగ్గుతాయి.
6. అల్లం టీ త్రాగితే వెన్ను నొప్పి తగ్గటానికి చాలా అవకాశాలు ఉన్నాయి.
7. ఏదైనా హెర్బల్ నూనెను ఉపయోగించి మర్దన చేస్తే త్వరగా రికవరీ కనబడుతుంది.
8. ఒక వస్త్రంలో బియ్యాన్ని పోసి మూట కట్టి, దానిని మైక్రోవేవ్ లో 5 నిముషాలు ఉంచి వేడి చేసి నొప్పి ఉన్న ప్రాంతంలో పెడితే ఉపశమనం కలుగుతుంది. ఇది వెన్నునొప్పికి అద్భుతంగా పనిచేస్తుంది.