Latest News

Powered by Blogger.
Wednesday, 14 October 2015

ఉదయం లేవగానే విసుగ్గా ఉంటోందా? అయితే ఆ పొరపాట్లు చేయొద్దు...

ఉదయం లేవగానే విసుగ్గా ఉంటోందా? ఒళ్లంతా పట్టేసినట్టు అనిపిస్తోందా? జీర్ణశక్తి బాగుండడం లేదా? బ్రేక్‌ఫాస్ట్‌ కూడా చేయాలనీ అన్పించటం లేదా? ఇందుకు కారణం నిద్ర లేచిన వెంటనే మనం చేసే కొన్ని తప్పులే. నిజం. వాటిని సరిదిద్దుకుంటే రోజంతా ఎంతో ఉల్లాసంగా, ఉత్సాహంగా ఉంటారు. ఇప్పుడు వాటి గురించి తెలుసుకుందాం.

ఉదయం లేవగానే చాలా మంది హడావిడిగా పనులు చేసేస్తూ ఉంటారు. ఇది మంచి అలవాటు కాదు. మెళకువ రాగానే కొంతసేపు మనసును ప్రశాంతంగా ఉంచుకోవాలి. రాత్రంతా నిద్రపోవడం వల్ల శరీరంలో కండరాలు పట్టేసినట్టు ఉంటాయి. కండరాలు ఫ్లెక్సిబుల్‌గా ఉండేలా శరీరాన్ని మెల్లగా అటు ఇటు కదపాలి. అలాగే నిద్ర లేవగానే కుడివైపు నుంచి మంచం దిగాలి. ఇలా చేయడం వల్ల శరీరంలోని భాగాలన్నింటికీ ఎనర్జీ సమానంగా అందుతుంది. గట్టిగా ఊపిరి తీసుకుని వదలాలి. గది ఉష్ణోగ్రతలో ఉన్న నీటిని మాత్రమే తాగాలి.

రాత్రంతా నిద్రపోవడం వల్ల కండరాలు, వెన్నుముక బిగుసుకుపోతాయి. అందుకే నిద్ర లేవగానే స్ర్టెచెస్‌ చేయాలి. శరీరాన్ని కదల్చాలి. తొడ కండరాలు, మోకాలి చిప్పలు బిగుసుకుపోయినట్టుంటే వాటితో మూడు నాలుగుసార్లు స్ట్రేచెస్‌ చేయాలి. ఆ తర్వాత రెండు, మూడుసార్లు శ్వాసకోశాల లోపలికంటా ఊపిరి తీసుకుని వదలాలి. ఇలా చేయడం వల్ల కండరాలు ఫ్లెక్సిబుల్‌ అయి రోజంతా చురుగ్గా ఉంటారు.

జీర్ణక్రియ బాగా అవడం కోసం నిద్ర లేచిన వెంటనే చాలామంది టీ లేదా కాఫీని తాగుతుంటారు. కానీ ఇవి ఎసిడిక్‌. అందుకే వీటికి బదులు నిమ్మకాయ రసం, మంచినీళ్లు తాగటం మంచిది. ఆ తర్వాత గ్రీన్‌ టీ తాగాలి.

నిద్రలేచిన వెంటనే కొందరు ఫోను, మెయిల్స్‌ చెక్‌ చేస్తుంటారు. ఇది మంచి అలవాటు కాదు. నిద్రలేచిన వెంటనే ఎంతో ఫ్రెష్‌గా ఉంటాం. ఆ ఎనర్జీని ముఖ్యమైన పనులకు ఉపయోగిస్తే మంచిది. అందుకే ఆఫీసుకెళ్లిన తర్వాతే మెయిల్స్‌ను చెక్‌ చేసుకోవడం ఉత్తమం. పొద్దున్నే మెయిల్స్‌ని చెక్‌ చేసుకున్నారనుకోండి, దాంట్లో ఏదైనా నచ్చని విషయం ఉంటే డిస్టర్బ్‌ అయ్యే అవకాశం ఉంది. అందుకే నిద్రలేచిన వెంటనే 20 నిమిషాల పాటు వ్యాయామం చేస్తే ఆరోగ్యానికి మంచిది.

  • Title : ఉదయం లేవగానే విసుగ్గా ఉంటోందా? అయితే ఆ పొరపాట్లు చేయొద్దు...
  • Posted by :
  • Date : 12:25 pm
  • Labels :
  • Blogger Comments
  • Facebook Comments
Top