మన శరీరంలో కళ్లకు ఉన్న ప్రాధాన్యతే వేరు. అందుకే మన పెద్దలు సర్వేంద్రియానాం నయనం ప్రధానం అని అన్నారు. కళ్లు ఆరోగ్యంగా, అందంగా ఉండాలంటే కొన్ని ఆహారాలను తప్పనిసరిగా తినాలి. అయితే వాటి గురించి తెలుసుకుందామా.....
సంవత్సరం పొడవునా లభించే సిట్రస్ ఫ్రూట్స్ ని ఎక్కువగా తీసుకోవాలి. వీటిల్లో విటమిన్-సి సమృద్దిగా ఉంటుంది. సిట్రస్ ఫ్రూట్స్‌లో యాంటాక్సిడెంట్లు కూడా ఎక్కువగా ఉండుట వలన కళ్లలోని కార్నియా దెబ్బతినదు.దాంతో కాటరాక్టు బారిన పడటం కూడా జరగదు.
కేరట్లలోబేటాకెరొటెనా,విటమిన్-ఎ పుష్కలంగా లభిస్తుంది. ఎంతో ఆరోగ్యవంతమైన కేరట్ రెటీనాను సైతం కాపాడటంలో సహాయం చేస్తుంది.ముఖ్యంగా కాటరాక్టు పాలబడనీయకుండా నియంత్రిస్తుంది. ఉడకబెట్టిన కేరట్లు వారంలో మూడు సార్లు తింటే కంటికి మంచిది.
బ్లూబెర్రీస్ రాత్రిపూట కంటిచూపు శక్తివంతంగా ఉండేట్టు చేస్తాయి. వీటిల్లో యాంథోసియానిన్స్, విటమిన్-సిలు సమృద్ధిగా ఉండుట వలన ఇవి కంటి చూపును మెరుగుపరచడమే కాకుండా కంటి అలసటను సైతం పోగొడతాయి.
పాలకూరలో విటమిన్స్, బేటాకెరొటెనా సమృద్దిగా ఉండుట వలన కంటికి చాలా మంచిది. కళ్లపై అతినీలలోహిత కిరణాల ప్రభావం పడకుండా కాపాడటమే కాకా కంటి చూపును మరింత శక్తివంతంగా చేస్తుంది. పాలకూరతో సలాడ్స్ చేసుకుని తినొచ్చు. పప్పు, కూర ఏదైనా వండుకోవచ్చు. దీన్ని ప్రతి రోజూఆహారంలో బాగంగా చేసుకుంటే కంటికి చాలా ఆరోగ్యం.