బరువు తగ్గాలనుకునే వారి కోసం చాలా రకాల డైట్ ప్లాన్‌లు వచ్చాయి. ప్రస్తుతం లేటె్‌స్టగా వచ్చిన మరొక డైట్ ప్లాన్ క్యాబేజీ సూప్ డైట్.. ఈ ఏడురోజుల డైట్ ప్లాన్ లో తక్కువ కొవ్వు, అధికంగా ఫైబర్ ఉంటుంది. క్యాబేజీ సూప్ డైట్ అనగానే చాలామంది కేవలం సూప్, సలాడ్ మాత్రమే తీసుకోవాలని భావిస్తారు. కానీ, ఈ ప్లాన్‌లో భాగంగా రోజులో వీలైనన్నిసార్లు క్యాబేజీ సూప్ తాగాలి. అలాగే రకరకాల ఆహార పదార్థాలను కూడా తినాలి. అవి ఏమిటో ఎలా తినాలో వివరంగా తెలుసుకుందాం.
మొదటి రోజు అరటి పండు పండు తప్ప మిగిలిన అన్ని రకాల పండ్లను తీసుకోవచ్చు. చక్కెర లేని బ్లాక్ టీ, బ్లాక్ కాఫీ, కాన్‌బెర్రీ జ్యూస్ వంటి వాటిని కూడా తీసుకోవచ్చు.
రెండో రోజు డైట్‌లో పండ్లు తినకుండా ఆకుకూరలకు ఎక్కువగా ప్రాముఖ్యం ఇవ్వాలి. క్యాబేజీ సూప్‌తో పాటుగా చిలగడ దుంప లేదా బంగాళా దుంప తినాలి.
మూడో రోజు అరటి పండ్లు, బంగాళా దుంపలు తప్ప మిగిలిన అన్ని రకాల కాయగూరలు, పండ్లు తీసుకోవాలి.
నాలుగో రోజు చక్కెర ఉండే పదార్థాలేవీ తీసుకోకుండా రోజు అంతా మీగడ తీసిన పాలు, అరటి పండ్లు మాత్రమే తీసుకోవాలి. వీలైతే మిల్క్‌షేక్స్ కూడా తీసుకోవచ్చు.
ఐదురోజు ప్రొటీన్ల కోసం ఉడికించిన స్కిన్ లెస్ చికెన్‌గానీ ఇతర మాంసంగానీ తినొచ్చు. అయితే దీన్ని ఉడికించేటప్పుడు మాత్రం నూనె తక్కువగా వేయాలి. దానిలో టొమాటోలు, బీన్స్ వంటి కాయగూరలతో కలిపి తినాలి.
కావాలంటే కొవ్వు తక్కువగా ఉండే చీజ్‌ని వాడవచ్చు.

ఆరో రోజు డైట్‌లో కూడా ఎక్కువగా ప్రొటీనే తీసుకోవాలి. అందువల్ల ఐదోరోజు ఏవైతే పదార్థాలు తీసుకున్నారో వాటిలో మీకిష్టమైన వాటినే తినాలి.
ఆఖరి రోజున బ్రౌన్ రైస్‌తో పాటు కూరగాయలు, చక్కెర లేని జ్యూస్‌లు క్యాబేజీ సూప్‌తో డైట్‌ని ముగించాలి. ప్లాన్ అంతా బాగానే ఉంది కానీ, వారం మొత్తం ఒకే రకమైన క్యాబేజీ సూప్ తీసుకోవడం బోరుగా అనిపిస్తుంది. అందుకని దానికి ఫ్లేవర్‌కోసం ఆరోగ్యకరమైన కొన్ని పదార్థాలు కలుపుకోవాలి. ఈ క్యాబేజీ డైట్‌ని నిపుణుల సలహా మేరకు పాటించాలి.