Latest News

Powered by Blogger.
Tuesday, 22 September 2015

హైహీల్స్‌ అంటే మోజు పడుతున్నారా? అయితే బి కేర్ ఫుల్

సాదారణంగా చాలామంది అమ్మాయిలు హీల్స్‌ వేసుకోవడానికి ఇష్టపడతారు. ప్రస్తుత కాలంలో అమ్మాయిలే కాకుండా హైహీల్స్‌ ని అబ్బాయిలు కూడా ఇష్టపడుతున్నారు. ఫ్లాట్స్‌ కన్నా హైహీల్స్‌ వాడే అమ్మాయిల పట్లే అబ్బాయిలు ఎక్కువగా ఆకర్షితులవుతారని అంటున్నారు పరిశోదకులు. హైహీల్స్‌ వేసుకున్న వారు పొడవుగా కనపడటమే కాకా వారి శరీరాకృతి ఆకర్షణీయంగా కనబడటమే దీనికి కారణమని అంటున్నారు.

పాదాలపై ఒత్తిడి
హై హీల్స్‌ వేసుకోవడం వల్ల కాళ్లపై అధిక ఒత్తిడి పడుతుంది. హీల్‌ సైజ్‌ పెరిగే కొద్దీ ఒత్తిడి కూడా పెరుగుతూ ఉంటుంది. ఒక అంగుళం ఉన్న హీల్‌ వల్ల 22 శాతం, రెండు అంగుళాల హీల్‌ వల్ల 57 శాతం, మూడు అంగుళాల హీల్‌ వల్ల 76శాతం అధిక భారం పాదాలపై పడుతుంది.

నడుము

నడుము కింది భాగంలో ఒత్తిడి పడి కొంచెం వెనక్కి వంగిపోయి, ఛాతీ భాగం ముందుకు వస్తుంది. అందువల్ల స్పాండిలైటిస్‌ వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి.

తుంటి భాగం
సాధారణంగా నిటారుగా నిలబడక పోవడం వలన కండరాలపై అధికంగా ఒత్తిడి పడుతుంది.

చీలమండ 
కాళ్లకు పాదాలకు మధ్య రక్తప్రసరణ సరిగా జరగక పోవడం వల్ల నరాలు బలహీనంగా మారి తద్వారా అనేక సమస్యలు వస్తాయి.

మోకాళ్లు 
ఎక్కువ ఒత్తిడి పడడం వల్ల ఆస్టియో ఆర్థరైటిస్‌ వస్తుంది. షాక్‌లను తట్టుకొనే శక్తి తగ్గిపోతుంది.

పాదాలు
శరీర బరువు అంతా పాదాలపై పడడం వల్ల నరాలు మరియు ఎముకలు దెబ్బతినే అవకాశం ఉంది.

  • Title : హైహీల్స్‌ అంటే మోజు పడుతున్నారా? అయితే బి కేర్ ఫుల్
  • Posted by :
  • Date : 11:37 am
  • Labels :
  • Blogger Comments
  • Facebook Comments
Top