Latest News

Powered by Blogger.
Wednesday, 16 September 2015

కాలిన మచ్చలకు చెక్ పెట్టాలంటే...కొన్ని సులభమైన చిట్కాలు

వంటింట్లో పనిచేసుకొనేటప్పుడు పొరపాటున వేడిగిన్నె పట్టుకోవడం, వేడినీళ్లు మీద పడడం జరుగుతూనే ఉంటుంది. ఇలా వచ్చిన మచ్చలు చాలా రోజుల వరకు అలాగే ఉంటాయి. అయితే కొన్ని చిట్కాల ద్వారా వాటిని చాలా త్వరగా పోగొట్టుకోవచ్చు.

ముందుగా కాలిన మచ్చఉన్న ప్రదేశాన్ని చల్లని నీటితో కడుక్కోవాలి. తరువాత నిమ్మరసంలో ముంచిన వస్త్రంతో మచ్చపై నెమ్మదిగా రుద్దాలి. ఇలా రెండు నిమిషాలపాటు చేసిన తరువాత మచ్చపై టొమాటో రసం రాయాలి. ఈ విధంగా రోజుకి రెండుసార్లు చేస్తే మచ్చలు పోతాయి.

రాత్రిపూట కొన్ని మెంతులు నానబెట్టి పొద్దున్నే పేస్టులా చేయాలి. ఈ మిశ్రమాన్ని మచ్చలపై రాసుకొని ఆరిన తరువాత కడుక్కోవాలి. ఇలా ప్రతిరోజూ చేస్తే మచ్చలు తగ్గుతాయి.

కొంచెం పసుపులో చల్లని నీళ్లు పోసి పేస్టులా చేసుకొని కాలిన మచ్చలపై రాసుకొని ఆరిన తరువాత కడుక్కోవాలి. ఇలా ప్రతిరోజూ చేయాలి.

బాదం నూనెతో మచ్చలున్న ప్రదేశాన్ని రోజుకి రెండుసార్లు మర్దనా చేస్తే మచ్చలు త్వరగా పోతాయి.

  • Title : కాలిన మచ్చలకు చెక్ పెట్టాలంటే...కొన్ని సులభమైన చిట్కాలు
  • Posted by :
  • Date : 5:19 pm
  • Labels :
  • Blogger Comments
  • Facebook Comments
Top