ఒకప్పుడు ఫేక్ కరెన్సీ అంటే నోట్లలో మాత్రమే జరిగేది. కాని ఇప్పుడు కాయిన్స్ లోకి కూడా నకిలీ వచ్చేసింది. గతంలో కాయిన్స్ తయారీ చాలా ఖర్చుతో కూడుకుని ఉండేది. ఇప్పుడేమో ప్రభుత్వం ఖర్చు తగ్గించుకునేందుకు తక్కువ ఖర్చు అయ్యే నాణేలను రూపొందిస్తోంది. ఇదే అదునుగా నకిలీ రాయుళ్లు ప్రజలకు పెద్దగా పరిచయంలేని నాణేల్లో నకిలీని గుప్పించి సొమ్ము చేసుకుంటున్నారు. తెలియక తీసుకుని తీరా తమ వద్ద ఉన్నవి నకిలీ డబ్బుల నాణేలని తెలిసి చాలా మంది తెల్లబోతున్నారు.
ఒరిజినల్ 10/- కాయిన్స్ కు నకిలీ 10/- కాయిన్స్ కు మధ్య ప్రధాన తేడాలు:
1)ఒరిజినల్ కాయిన్ కి… పైన 10 గీతలుంటాయి, ఫేక్ కాయిన్ కి 15 గీతలుంటాయి:

2) ఒరిజినల్ కాయిన్ కి…10 అనే సంఖ్య, సిల్వర్ అండ్ గోల్డ్ కలర్ రెండింటిని టచ్ చేస్తూ ఉంటుంది, ఫేక్ కు కేవలం సిల్వర్ కలర్ లోనే 10 అనే సంఖ్య ఉంటుంది.

3)ఒరిజినల్ కాయిన్ కు పైన రూపీ సింబల్ ఉంటుంది, ఫేక్ కాయిన్ కు ఉండదు.

4)ఒరిజినల్ కాయిన్ కు భారత్ అనే హిందీ పదం, ఇండియా అనే ఇంగ్లీష్ పదం.. కాయిన్ అడ్డంలో ఉంటాయి. ఫేక్ కాయిన్ కు ఈ పదాలు నిలువులో ఉంటాయి.

5)ఒరిజినల్ కాయిన్ కు ఎటువంటి గీతలుండవ్..అదే ఫేక్ కాయిన్ కు నాలుగు సింహాల మీదుగా రెండు లైన్స్ అతికించిన విధంగా ఉంటాయి.

ఈ 5 జాగ్రత్తలు పాటిస్తే…10 రూపాయల ఫేక్ కాయిన్ ను ఇట్టే గుర్తుపట్టవచ్చు.