Latest News

Powered by Blogger.
Friday, 6 May 2016

కడుపు మాడ్చుకుంటే....బరువు తగ్గుతామా?

బరువు తగ్గటానికి తిండి మానేసి కడుపు మాడ్చుకుంటే సరిపోదు. అయితే తెలివిగా తింటూ బరువు తగ్గాలని పోషకాహార నిపుణులు అంటున్నారు. బరువు తగ్గటానికి కొన్ని ఆహారాలు సహాయపడతాయి ఇప్పుడు ఆ ఆహారాల గురించి వివరంగా తెలుసుకుందాం.

నల్ల మిరియాలు - నిమ్మ రసం

నల్ల మిరియాలు,నిమ్మరసం కలిపి తయారుచేసే కాషాయం బరువు తగ్గించటంలో బాగా సహాయపడుతుంది. నల్ల మిరియాల్లో ఉండే పైపరీన్‌ అనే రసాయనం మిరియాలకు ఘాటును ఇవ్వటమే కాకుండా రక్తంలో కొవ్వు స్థాయిలను తగ్గిస్తుంది. ఇది కొవ్వు కణాల ఉత్పత్తికి అడ్డుపడి ఆహారం నుండి పోషకాలను శరీరం శోషించుకోవటానికి సహాయపడుతుంది. ఇక నిమ్మరసం విషయానికి వస్తే జీర్ణక్రియకు సహాయపడుతుంది.

ఒక గ్లాస్ నీటిలో అర చెక్క నిమ్మరసం,కొంచెం మిరియాల పొడి కలిపి కషాయాన్ని తయారుచేసుకోవాలి. ఈ కషాయాన్ని ప్రతి రోజు భోజనం అయిన తర్వాత త్రాగితే మంచి పలితం కనపడుతుంది. 

యాపిల్‌ స్నాక్‌

ప్రతి రోజు ఒక ఆపిల్ తింటే అధిక బరువు సమస్యను తరిమి కొట్టవచ్చు. యాపిల్ లో అనేక పోషకాలు మరియు బరువు తగ్గించే లక్షణాలు ఉన్నాయి. దీనిలో అధికంగా పీచు పదార్ధం ఉండుట వలన ఆకలిని తగ్గిస్తుంది. అంతేకాక రక్తంలో చక్కెర స్థాయిలను,ఆకలిని,శక్తి స్థాయిలను క్రమబద్దీకరణ చేస్తుంది. యాపిల్ లో ఉండే పెప్టిన్‌ రక్తంలో కొలస్ట్రాల్ ని తగ్గిస్తుంది. 

చాకొలెట్‌ తినేందుకు వెనకాడొద్దు

ఏదైనా స్వీట్ తినాలని కోరిక కలిగినప్పుడు డార్క్ చాక్లెట్ తినటానికి ప్రయత్నించవచ్చు. దీన్ని తింటే స్వీట్ తినాలనే కోరిక తగ్గుతుంది. అలాగే డార్క్ చాక్లెట్ లో ఉండే ఫ్లేవనాయిడ్స్‌ ఇన్సులిన్ ని నిరోదిస్తాయి. 70 శాతం డార్క్ చాక్లెట్ ను మాత్రమే తీసుకోవాలి. భోజనం తర్వాత తింటే మంచి ప్రయోజనం కలుగుతుంది. ఆ ముక్క సైజ్‌ మీ చేతి బొటనవేలంత ఉండాలి. ఆ విధంగా ఉంటేనే ప్రయోజనం కలుగుతుంది. 

మధ్య మధ్యలో స్పూన్‌ బ్రేక్‌

మీరు స్పూన్‌తో తింటుంటే కనుక ఒక ముద్ద పెట్టుకున్నాక స్పూన్‌ పక్కనపెట్టాలి. ఇది మిమ్మల్ని ఎక్కువగా తినకుండా చేస్తుంది. శరీరంలోకి అధిక కెలొరీలు చేరకుండా ఉండాలంటే speed గా తినకూడదు. నిదానంగా నమిలి తినాలి. మధ్య మధ్యలో స్పూన్‌ను పక్కన పెట్టడం మొదట్లో సిల్లీగా అనిపిస్తుంది. కాని మీ బరువును మేనేజ్‌ చేయటానికి ఈ టెక్నిక్‌ చాలా బాగా ఉపయోగపడుతుంది. స్పూన్‌తో తినని వారు వెంటవెంటనే చేతితో ముద్దలు నోట్లో పెట్టుకోకుండా ముద్దకి ముద్దకీ మధ్య కాస్త విరామం ఇచ్చి తినటం అలవాటు చేసుకోవాలి.

  • Blogger Comments
  • Facebook Comments
Top