కొన్ని సార్లు మనం చాలా తక్కువ మొత్తంలో ఆహారం తీసుకున్నా కడుపు ఉబ్బరంగా అనిపిస్తుంది. అటువంటి సమయంలో టేబ్లేట్ లేదా సిరప్ వేసుకోవటం కన్నా ఆ సమస్య బారిన పడకుండా జాగ్రత్తలు తీసుకుంటే మంచిది. సాదారణంగా మలబద్దకం సమస్య శారీరక శ్రమ తక్కువగా ఉండేవారు మరియు పీచు, ద్రవ పదార్దాలు తక్కువగా తీసుకొనే వారిలో కనపడుతుంది. ఈ మలబద్దకం సమస్య కడుపు ఉబ్బరానికి దారి తీస్తుంది.
ఈ సమస్య నుండి బయట పడాలంటే మనం తీసుకొనే ఆహారంలో పీచు ఎక్కువగా ఉండే పండ్లు,కూరగాయలు మరియు పొట్టు ధాన్యాలు ఉండేలా చూసుకోవాలి. ప్రతి రోజు మన శరీరానికి 25 గ్రాముల పీచు అవసరం అవుతుంది. వీటితో పాటు మంచి నీటిని ఎక్కువగా త్రాగాలి. అలాగే వారంలో 5 రోజులు తప్పనిసరిగా వ్యాయామం చేయాలి.
మనం ఆహారాన్ని బాగా నమిలి తినాలి. అలా కాకుండా గబగబా తినేస్తే కడుపులోకి గాలి చేరి కడుపు ఉబ్బరానికి దారి తీస్తుంది. నిపుణుల చెప్పిన దాని ప్రకారం భోజనాన్ని కనీసం అరగంట పాటు బాగా నమిలి తినాలి. నిదానంగా తినటం వలన కడుపు నిండిన భావన కలిగి తక్కువ ఆహారాన్ని తీసుకుంటాం. అంతేకాక కడుపు ఉబ్బరం కూడా తగ్గుతుంది. అలాగే ఉప్పు,చక్కర ఎక్కువగా ఉన్న ఆహారాలను ఎక్కువగా తీసుకొనే వారిలో కూడా ఈ కడుపు ఉబ్బరం సమస్య కనపడుతుంది. అందువల్ల వాటికీ బదులుగా పీచు ఉన్న ఆహారాలను తీసుకుంటే ఈ సమస్య నుండి సులభంగా బయట పడవచ్చు.