ఎండాకాలంలో త్వరగా ఆహార పదార్దాలు,కూరగాయలు, పండ్లు తొందరగా పాడై పోతూ ఉంటాయి. అందువలన వాటిని ఫ్రిజ్ లో పెడుతూ ఉంటాం. అయితే కొన్ని ఆహార పదార్దాలను, కూరగాయలను ఫ్రిజ్ లో పెట్టకూడదు. ఇప్పుడు వాటి గురించి తెలుసుకుందాం.
టమోటాలు
టమోటాలను ఫ్రిజ్ లో పెట్టటం వలన వాటిపై ఉన్న పలుచని పొర ముడతలు పడి విటమిన్ సి కోల్పోయే అవకాశం ఉంది. అలాగే రుచి కూడా తగ్గిపోతుంది.
ఉల్లిపాయలు
ఉల్లిపాయలను ఫ్రిజ్ లో ఉంచటం మంచిది కాదు. ఎందుకంటే ఉల్లిపాయలో అధిక నీటి శాతం ఫ్రిజ్ లో ఉండే చల్లదనానికి ఐస్ గా మారి వాటి పొరలను దగ్గరకు చేస్తుంది. దాంతో ఉల్లిపాయలు సహజత్వం కోల్పోయి పోషకాలు తగ్గిపోతాయి.
బంగాళదుంపలు
బంగాళదుంపలను ఫ్రిజ్ లో పెడితే బంగాళదుంప పై తొక్క మరియు లోపల ఉండే పిండి పదార్దంలో తేమ కోల్పోతుంది. అందువల్ల తొక్క తీసే సమయంలోను, ముక్కలను కోసే సమయంలోను కొన్ని ఇబ్బందులు వస్తాయి. అంతేకాక వాటితో తయారు చేసే వంటలు కూడా రుచి లేకుండా ఉంటాయి.
మునక్కాయ
మునక్కాయను ఫ్రిజ్ లో ఉంచటం వలన తేమ కోల్పోయి గట్టిగా కొయ్య ముక్కాలా తయారవుతాయి.
పుచ్చకాయ
పుచ్చకాయ,పుచ్చకాయ ముక్కలను ఫ్రిజ్ లో ఉంచితే వాటిలో ఉండే యాంటి ఆక్సిడెంట్ పూర్తిగా పోతాయి. అంతేకాక పుచ్చకాయ తీపి దనం కోల్పోయి చప్పగా మారుతుంది.
తేనే
తేనెను ఫ్రిజ్ లో ఉంచుట వలన చిక్కగా మారటమే కాకుండా స్పటికంగా మారుతుంది. దాంతో వాడుకోవటానికి కష్టం అవుతుంది. రుచిలో కూడా తేడా వస్తుంది.