బరువు తగ్గాలంటే చాలా మంది తీవ్రంగా వ్యాయామం చేస్తే తగ్గిపోతామని అనుకుంటారు. కానీ వ్యాయామాలతో పాటుగా ఆహార నియమాలు కూడా పాటిస్తే బరువు తొందరగా తగ్గటానికి దోహదం చేస్తాయి. బరువు తగ్గటం సహాయపడే కొన్ని రకాల పానీయాల గురించి తెలుసుకుందాం.
మ్యాంగో లస్సి
లస్సీలో ఆరోగ్యకరమైన బ్యాక్టీరియాలు బోలెడు ఉన్నాయి. ఇవి బ్లోటింగ్, వాపును తగ్గిస్తాయి. ఒక కప్పు గ్రీక్ యోగర్ట్ (ప్రత్యేక వాతావరణంలో తయారుచేసిన గడ్డ పెరుగు), ఒక స్పూన్ పంచదార, అర కప్పు మామిడి ముక్కలు, కొన్ని మంచినీళ్లు. వీటిని బ్లెండర్ లో వేసి మెత్తగా చేసుకొని త్రాగాలి.
గోల్డెన్ మిల్క్
ఈ పాలు శరీరాన్ని ఫ్లెక్సిబుల్‌గా మారుస్తాయి. బ్లోటింగ్, అలర్జీల వంటి వాటిని తగ్గించటంలో సహాయపడతాయి. ఒక కప్పు పాలలో ఒక స్పూన్ పసుపు వేసి వేడి చేసుకొని త్రాగాలి. తీపి ఇష్టం ఉన్నవారు కొంచెం తేనెను కూడా కలుపుకోవచ్చు. పసుపు కొవ్వు నిల్వ చేసే జన్యువుల మీద పనిచేస్తుంది. పాలలో ఉండే క్యాల్షియం బాడీమాస్ను తగ్గిస్తుంది.
అల్లం టీ
ప్రతి రోజు ప్రారంభాన్ని ఒక కప్పు అల్లం టీతో ప్రారంభిస్తే జీర్ణ వ్యవస్థ చురుకుగా ఉంటుంది. అర స్పూన్ పచ్చి అల్లంను నీటిలో వేసి 5 నిమిషాల పాటు మరిగించాలి. ఆ తర్వాత ఒక కప్పులో మనకు నచ్చిన టీ బ్యాగ్ వేసి మరిగించిన అల్లం నీటిని పోయాలి. ఈ టీని క్రమం తప్పకుండా త్రాగితే పొట్ట తగ్గుతుంది.
ఉసిరి రసం
ఉసిరి బరువు తగ్గించడమే కాకుండా ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. దీనిలో యాంటీఆక్సిడెంట్లు సమృద్దిగా ఉండుట వలన డయాబెటిస్, కొలెస్ర్టాల్ స్థాయిలను తగ్గించటంలో సహాయపడుతుంది.
మసాలా టీ
బరువు పెరుగటను నిరోధించటంలో ఈ టీ సహాయపడుతుంది.
ఒక కప్పు పాలలో దాల్చినచెక్క, యాలక్కాయ,లవంగం, జీలకర్ర, సోంపు, అల్లం, జాజికాయ పొడుల్ని ఒక్కో టీస్పూన్ చొప్పున వేసి మరిగించాలి. ఆ తర్వాత ఒక కప్పులో మనకు నచ్చిన టీ బ్యాగ్ వేసి మరిగించిన పాలను పోయాలి. దాల్చినచెక్క రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రించి బరువు పెరగకుండా సహాయపడుతుంది. లవంగాలు యాంటీఇన్ఫ్లెమెటరీ, యాంటీసెప్టిక్ గుణాలు కలిగి ఉంటాయి. యాలకలు రక్తప్రసరణను మెరుగుపరుస్తాయి, జీలకర్ర, సోంపు, అల్లం, జాజికాయలతో తయారైన ఈ టీ జీర్ణవ్యవస్థకు ఎన్నో లాభాలను కలిగిస్తుంది.
కలబంద రసం
కలబంద రసం (అలొవెరా జ్యూస్) బరువు తగ్గించడంలో కీలకమైన పాత్రను పోషిస్తుంది. ఆడవాళ్లలో హార్మోన్ల పనితీరును క్రమపరుస్తుంది. అంతేకాకుండా సంతాన సాఫల్య సామర్ధ్యాన్ని కూడా పెంచుతుందని నమ్మకం.