జొన్నపిండి - 2 కప్పులు
బియ్యప్పిండి - పిడికెడు
ఉప్పు - రుచికి తగినంత
నువ్వులు - 1 కప్పు
నీరు - తగినంత
తయారుచేసే విధానం
ఒక గిన్నెలో బియ్యప్పిండి, జొన్నపిండి, ఉప్పు వేసి వేడి నీటితో కలుపుతూ గట్టి ముద్దలా తయారుచేసుకోవాలి. ఈ పిండిని ఒక అరగంట సేపు పక్కన పెడితే నానుతుంది. పిండిని 4 సమ భాగాలుగా చేసి అరచేత్తో పూరీసైజుకు ఒత్తి రెండు వైపులా నువ్వుల్లో అద్దాలి. ఇప్పుడు రొట్టెల పీట మీద పొడి(జొన్న)పిండి చల్లుతూ అప్పడాల కర్రతో మెల్లగా ఒత్తుతూ గుండ్రంగా పెద్దగా చేయాలి. దీనిని పెనం మీద జాగ్రత్తగా విరగకుండా వేసి నీరు తడిపిన గుడ్డతో ఒక సారి రొట్టె పై పైన తుడవాలి. (రొట్టె మీద అంటిన పొడి పిండి పోతుంది) ఒకవైపు కాల్చిన తర్వాత రెండో వైపు తిప్పి అదే మాదిరిగా తడిగుడ్డతో తుడవాలి. ఈ విధంగా అటూ ఇటూ తిప్పుతూ రెండువైపులా దోరగా కాల్చి తీసేయాలి.