నెలసరి అయిపోయిన వారం రోజుల లోపు ఉపవాసం ఉండకపోవడమే మంచిది. రక్తస్రావం వల్ల కాస్త నిస్సత్తువగా ఉంటారు. ఒకవేళ ఉపవాసం ఉన్నా.. అరటిపండు, యాపిల్, పుచ్చకాయ వంటి పండ్ల ముక్కలను తీసుకోవాలి. వాటి వల్ల శరీరానికి కావలసినంత నీరు అందుతుంది.
ఉపవాసం ఉండేవారిలో కొందరు టీ, కాఫీలకు ప్రాధాన్యం ఇస్తూ ఉంటారు. వాటి జోలికి వెళ్ళకుండా ఉండటమే మంచిది. ఉపవాసం ఉన్నప్పుడు పుష్కలంగా మంచి నీటిని తాగాలి. నిమ్మరసం, కొబ్బరి నీళ్లూ, ఏవైనా పండ్ల రసాలు త్రాగితే చాలా మంచిది . ఇవన్నీ శరీరంలోని వ్యర్థాలను బయటకు పంపి తక్షణ శక్తిని అందిస్తాయి జీర్ణవ్యవస్థ శుభ్రపడుతుంది. ఈ విధంగా చేయటం వలన ఆడవారిలో తలెత్తే మూత్ర సంబంధిత సమస్యలూ అదుపులోకి వస్తాయి.
చాలామంది మహిళలు తినాలనే ధ్యాస నుంచి దృష్టి మరల్చుకునేందుకు ఇంటి పనుల్లో నిమగ్నమవుతారు. అలా కాకుండా కొంచెం కళ్లు మూసుకుని విశ్రాంతి తీసుకోవాలి. మంద్రమైన సంగీతం వింటూ.. ధ్యానం చేయడం మంచిది.
మర్నాడు ఆకలి ఉంది కదాని అతిగా తినేయకూడదు. తేలికపాటి ఆహారాన్ని మాత్రమే తీసుకోవాలి. అన్నం కూరలతో పాటూ, సగ్గుబియ్యం జావ, పండ్ల ముక్కలు తీసుకోవాలి.