Latest News

Powered by Blogger.
Tuesday, 8 March 2016

జీన్స్‌ ఎక్కువకాలం మన్నాలంటే...కొన్ని జాగ్రత్తలు

మనం ఎంతో కష్టపడి కొనుక్కున్న జీన్స్‌ ఎక్కువ కాలం మన్నికగా ఉండాలంటే కొన్ని జాగ్రత్తలను పాటించాలి.పదే పదే ఉతకకూడదు . మురికి పట్టనంతకాలం జీన్స్‌ని ఉతక్కుండానే వేసుకోవచ్చు. ఐదు లేదా ఆరు జతల జీన్స్‌ ఉంటే రొటేషన్‌లో వేసుకోవచ్చు. ఈ విధంగా చేయడం వల్ల రోజుకో జీన్స్‌ వేసుకోవచ్చు. దీని వల్ల అవి ఎక్కువ రోజులు శుభ్రంగా ఉంటాయి.

జీన్స్‌ మీద మరకలు,మచ్చలు పడినప్పుడు జీన్స్‌ మొత్తం ఉతకవలసిన అవసరం లేదు. మరక పడిన ప్రాంతంలో శుభ్రం చేస్తే సరిపోతుంది. లిక్విడ్‌ డిటర్జెంట్‌ని మరక మీద వేసి కొన్ని నిమిషాల పాటు అలా ఉంచి ఆ తరువాత అంత మేరకు స్క్రబ్‌ చేసి నీటిలో జాడిస్తే సరిపోతుంది.

మీకెంతో నచ్చిన జీన్స్‌ ఎక్కువ కాలం మన్నికగా ఉండాలంటే చేతితో ఉతకాల్సిందే. వెడల్పాటి టబ్‌లో జీన్స్‌ మునిగే వరకు గోరువెచ్చని నీటిని నింపి అందులో ఒక క్యాప్‌ లిక్విడ్‌ డిటర్జెంట్‌ వేయాలి. ఆ నీటిలో జీన్స్‌ను సమంగా పరిచి ఇరవై నిమిషాల పాటు నానబెట్టాలి. ఆ తరువాత ఆ నీటిలోనే నుసిమి శుభ్రమైన నీటిలో పిండి ఆరేయాలి.

మిగతా బట్టలతో కలిసి జీన్స్‌ ఉతుకుతుంటారు. కాని ఆ విధంగా చేయకూడదు. వేరే బట్టలతో కలిపి ఉతకడం వల్ల జీన్స్‌ ఫ్యాబ్రిక్‌ మీద అనవసరమైన రాపిడి కలుగుతుంది. అందువల్ల జీన్స్‌ను జీన్స్‌తో కలిపే ఉతకాలి. ఒక వేళ వాషింగ్‌ మెషిన్‌లో వేస్తె కనుక ఎక్కువ లోడ్‌ వేయొద్దు. ఒకో లోడ్‌కి నాలుగు జీన్స్‌ మాత్రమే వేయాలి. కలర్‌, ప్లెయిన్‌ జీన్స్‌ను కలిపి ఉతకకూడదు. నలుపు రంగు జీన్స్‌, క్రీమ్‌, వైట్‌ వంటి రంగుల జీన్స్‌తో అసలు ఉతకకూడదు. వేటికవి విడివిడిగా ఉతకాలి.

ఉతికేముందు జీన్స్‌ని తిరగల తీయాలి. దీని వల్ల బయటి వైపు ఫ్యాబ్రిక్‌ రంగు మారకుండా ఉంటుంది. వాషింగ్‌ మెషిన్‌లో జీన్స్‌ వేస్తుంటే డెలికేట్‌ సెట్టింగ్స్‌ ఎంపిక చేసుకోవాలి. దీనివల్ల వేగం, వాషింగ్‌ సైకిల్‌ తక్కువగా ఉంటుంది. జీన్స్‌ ఉతికేందుకు మెషిన్‌లో వేడి నీటి సెట్టింగ్‌ వాడకూడదు. చల్లని నీటి సెట్టింగ్‌ మాత్రమే వాడాలి.

జీన్స్‌ ఫ్యాబ్రిక్‌ రంగు వెలవకుండా ఎక్కువకాలం మన్నాలంటే ఇంట్లో వాడే ఒక కప్పు వైట్‌ వెనిగర్‌ , పావు కప్పు ఉప్పులను చల్లటి నీళ్లలో కలపాలి. ఈ నీటిలో ఉతికితే జీన్స్‌ రంగు పోదు. వాషింగ్‌ మెషిన్‌లో వేస్తే కనుక ఎన్ని ట్రిప్‌లు జీన్స్‌ వేస్తే అన్నిసార్లు నీళ్లలో ఆ రెండింటిని కలపాలి. వీటి వల్ల జీన్స్‌ వాసన వస్తుంది. కాని ఆరాక ఆ వాసన జీన్స్‌ని వదిలిపోతుంది.

      • Title : జీన్స్‌ ఎక్కువకాలం మన్నాలంటే...కొన్ని జాగ్రత్తలు
      • Posted by :
      • Date : 6:30 am
      • Labels :
      • Blogger Comments
      • Facebook Comments
      Top