Latest News

Powered by Blogger.
Wednesday, 10 February 2016

చలికాలంలో చర్మం పొడిగా మారకుండా....కొన్ని జాగ్రత్తలు

క్లెన్సింగ్: చర్మం పొడిగా అన్పిస్తే పాలలో దూదిని ముంచి ముఖానికి రాసి ఆరిన తర్వాత చల్లని నీటితో కడగాలి. ఈ విధంగా రోజుకు రెండు లేదా మూడు సార్లు చేయాలి. దీని వల్ల చర్మం పొడిగా మారదు. మృతకణాలు, మలినాలు తొలగిపోయి చర్మం కాంతివంతంగా మారుతుంది.

స్కబ్బింగ్: ఒక బౌల్ లో యాపిల్ గుజ్జు రెండు స్పూన్లు, అరటిపండు గుజ్జు రెండు టేబుల్‌స్పూన్లు, టేబుల్‌స్పూన్ తేనె కలిపి ముఖానికి పట్టించాలి. ఆ రెండు నిమిషాల పాటు వేళ్ల సాయంతో వలయాకారంగా మసాజ్ చేస్తూ శుభ్రం చేయాలి. ఆ తర్వాత మెత్తటి కాటన్ టవల్‌తో ముఖం అంతా అద్దాలి. ఈ విధంగాచలికాలంలో ప్రతి రోజు చేయవచ్చు. దీని వల్ల చర్మం పొడిగా మారే పరిస్థితి ఉండదు.

టోనింగ్: ఈ కాలంలో చర్మం సాగడం, ముడతలు పడినట్టు అనిపించడం సహజంగానే జరుగుతుంది. అందుకని ఈ కాలంలో తప్పనిసరిగా టోనింగ్ చేసుకోవాలి . టోనింగ్ వల్ల స్వేద రంధ్రాలు తెరుచుకొని సహజ నూనెలు బయటకు వస్తాయి.

మాయిశ్చరైజింగ్: చర్మం పొడిబారి, తెల్లని పొడ తేలుతున్నట్టుగా ఉంటుంది కొంతమందికి. ఈ సమస్యకు విరుగుడుగా బాదం నూనె లేదా ఆలివ్ ఆయిల్‌ను కొద్దిగా వేడి చేసి రోజూ రాత్రి పడుకునే ముందు చర్మానికి పట్టించి మృదువుగా మర్దనా చేయాలి. రోజు విడిచి రోజు కోల్డ్ క్రీమ్‌లో కొద్దిగా కొబ్బరి నూనె కలిపి రాసుకున్నా పొడి సమస్య బాధించదు.

వెన్న: టీ స్పూన్ వెన్నలో చిటికెడు పసుపు వేసి కలిపి, ముఖానికి చేతులకు పట్టించి పది నిమిషాల తర్వాత గోరువెచ్చని నీటితో స్నానం చేస్తే చర్మం మృదువుగా మారుతుంది.

చర్మానికి దాహం: తగినన్ని నీళ్లు అందకపోతే మొక్కల మాదిరిగానే చర్మమూ వడలిపోతుంది. ఈ సమస్యకు ఒకే ఒక్క పరిష్కారం రోజూ 10 గ్లాసులకు తగ్గకుండా మంచినీళ్లు తాగడం. మజ్జిగ, పండ్లరసాల రూపంలోనూ తగినన్ని నీళ్లను ఒంట్లోకి చేర్చవచ్చు. దీని వల్ల సహజకాంతి పెరుగుతుంది.

సన్‌స్క్రీన్: చలికాలంలో సన్‌స్క్రీన్ అవసరం లేదని అందరూ అనుకుంటారు. కానీ, ఈ కాలమే తప్పనిసరిగా వాడాలి. చలికి ఎండలో ఎక్కువ సమయం గడుపుతారు. అదీ కాకుండా చర్మం పొడిబారి ఉంటుంది. ఇలాంటప్పుడు అతినీలలోహిత కిరణాలు నేరుగా చర్మానికి తాకితే సమస్య ఇంకా పెరుగుతుంది. అందుకని, సన్‌స్క్రీన్ లోషన్‌ని తప్పనిసారిగా వాడాలి.

  • Title : చలికాలంలో చర్మం పొడిగా మారకుండా....కొన్ని జాగ్రత్తలు
  • Posted by :
  • Date : 7:00 am
  • Labels :
  • Blogger Comments
  • Facebook Comments
Top