* పిల్లలకు చెవులు కుట్టించడానికి ముందుగా తలస్నానం చేయించాలి. చెవులు కుట్టించిన తర్వాత ఒక వారం రోజుల పాటు చెవులపై నీళ్లు పడకుండా జాగ్రత్తగా స్నానం చేయించాలి. వీలు అయినంతవరకు చెవులకు చల్లటి నీటిని తగలకుండా చూసుకోవాలి . అంతేకాక కొంత కాలం పాటు స్టడ్స్ లేదా చిన్నచిన్న రింగుల వంటివి పెట్టాలి. నొప్పి తగ్గి.. చెవి రంధ్రం కాస్త పెద్దది అయ్యాక వేలాడేవి పెట్టొచ్చు.
* చెవులు కుట్టించిన మొదటి రెండు మూడు రోజులు చిన్నారులకు తల మీదుగా వేసే దుస్తులు వేయకుండా ...ముందు వైపు గుండీలు ఉండే బట్టలను ఎంచుకుంటే మంచిది. వారికి పెట్టిన రింగులూ, చిన్న స్టడ్స్ ఏవయినా సరే.. దుస్తులకు పట్టుకోకుండా ఉంటాయి.
* చర్మం సున్నితంగా ఉన్నవారికి కొన్నిసార్లు చెవుల దగ్గర చీము పట్టే అవకాశం ఉంది . అలాంటి సమయంలో దూదితో తుడిచి కొబ్బరి నూనెతో మసాజ్ చేయడం వల్ల మంచి ఫలితం ఉంటుంది.
* మరీ పసిపిల్లలకు కుట్టించినప్పుడు వాళ్లకు తెలియక చెవుల్నీ, చెవులకు పెట్టిన కమ్మల్ని లాగటానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు. ఆ విధంగా లాగినప్పుడు గాయం కావచ్చు. అందువల్ల వారిని జాగ్రత్తగా చూసుకోవాలి. కొన్నిసార్లు పిల్లలకు రాగితో చెవులను కుట్టించినప్పుడు అది పడక చీము పట్టొచ్చు. అలాంటిది గమనిస్తే.. దాన్ని వెంటనే తీసేయడం మంచిది. పడే లోహాన్నే ఉపయోగించాలి.