ప్రతి రోజు కాచి చల్లార్చిన నీటిని తాగితే జలుబు నుంచి తొందరగా ఉపశమనం కలుగుతుంది.
పాలలో జాజికాయ, అల్లం, కుంకుమ పువ్వు కలుపుకుని మరగబెట్టాలి. నీరు సగానికి వచ్చే వరకు మరిగించాలి. ఈ మిశ్రమం గోరువెచ్చగా ఉన్నప్పుడే త్రాగాలి . దీంతో జలుబు నుంచి తక్షణ ఉపశమనం కలుగుతుంది.
ఏడు- ఎనిమిది మిరియాలు నేతిలో వేగించి తినాలి. ఆ తర్వాత గోరు వెచ్చని పాలను త్రాగాలి. దీంతో శరీరంలో వ్యాధి నిరోధక శక్తి పెరిగి జలుబు తొందరగా తగ్గుతుంది.
తమలపాకు రసంలో లవంగాల పొడి , అల్లం రసం, తేనె కలపాలి. ఈ మిశ్రమాన్ని త్రాగితే వెంటనే జలుబు మటుమాయం అయ్యిపోతుంది.
గొంతు నొప్పి సమస్యతో బాధపడుతుంటే... పరగడుపున ఒక గ్లాసు గోరువెచ్చటి నీటిలో చిటికెడు జీలకర్ర పొడి, టీ స్పూన్ తేనె, టీ స్పూన్ నిమ్మరసం కలిపి త్రాగాలి. ఈ విధంగా ఒక వారం రోజుల పాటు చేస్తే పూర్తిగా ఉపశమనం లభిస్తుంది.
గ్లాసు గోరువెచ్చని నీటిలో టీ స్పూన్ నెయ్యి కలిపి రాత్రి పడుకునే ముందు తీసుకుంటే మలబద్దకం నుండి ఉపశమనం లభిస్తుంది